ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

అసలైన రాజనీతిజ్ఞుడు మన్మోహన్‌

ABN, Publish Date - Dec 28 , 2024 | 06:00 AM

మాజీ ప్రధాని డాక్టర్‌ మన్మోహన్‌ సింగ్‌ భారత రాజకీయ, ఆర్థిక రంగాల్లో ఓ మహోన్నత వ్యక్తి అని, అసలైన రాజనీతిజ్ఞుడని కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ(సీడబ్ల్యూసీ) పేర్కొంది.

భారత రాజకీయ, ఆర్థిక రంగాల్లో మహోన్నత వ్యక్తి

మాజీ ప్రధానికి సీడబ్ల్యూసీ ఘన నివాళి

న్యూఢిల్లీ, డిసెంబరు 27 : మాజీ ప్రధాని డాక్టర్‌ మన్మోహన్‌ సింగ్‌ భారత రాజకీయ, ఆర్థిక రంగాల్లో ఓ మహోన్నత వ్యక్తి అని, అసలైన రాజనీతిజ్ఞుడని కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ(సీడబ్ల్యూసీ) పేర్కొంది. తన జీవితం, అందించిన సేవలతో మన్మోహన్‌ దేశ దశ, దిశను మార్చేశారని అభిప్రాయపడింది. ఈ మేరకు మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ఘన నివాళి అర్పిస్తూ సీడబ్ల్యూసీ ఓ తీర్మానం చేసింది. మన్మోహన్‌ సింగ్‌ మృతి నేపథ్యంలో న్యూఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో సీడబ్ల్యూసీ శుక్రవారం సమావేశం అయింది. కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ, జైరాం రమేశ్‌, కేసీ వేణుగోపాల్‌ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని మాజీ ప్రధానికి పుష్పాంజలి ఘటించారు. 1990ల్లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా పని చేసిన మన్మోహన్‌ సింగ్‌ భారతదేశ ఆర్థిక రంగ సరళీకరణకు రూపశిల్పి అని సీడబ్ల్యూసీ తన తీర్మానంలో పేర్కొంది. మన్మోహన్‌ ముందుచూపుతో చేపట్టిన సంస్కరణలు భారతదేశం ఆర్థిక సంక్షోభాన్ని తట్టుకొని నిలబడేలా చేశాయని, అంతర్జాతీయ వాణిజ్యాన్ని ప్రోత్సహించాయని తెలిపింది. ప్రైవేటీకరణ, విదేశీ పెట్టుబడులకు ప్రోత్సహించడం వంటి నిర్ణయాలతో మన్మోహన్‌సింగ్‌ భారతదేశాన్ని ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా చేశారని వివరించింది. ఉపాధి హామీ పథకం, విద్యా హక్కు చట్టం, జాతీయ ఆహార భద్రత చట్టం, భూసేకరణ చట్టం, వ్యవసాయ రుణ మాఫీ, ఎస్సీ, ఎస్టీలకు సామాజిక న్యాయం అందించే 93వ రాజ్యాంగ సవరణ, సమాచార హక్కు చట్టం వంటివి అన్నీ మన్మోహన్‌ హయాంలోనే జరిగాయని సీడబ్ల్యూసీ గుర్తు చేసింది. సమ్మిళిత వృద్ధి, విదేశీ వ్యవహారాలు, ఆర్థిక రంగ బలోపేతం వంటి అంశాలతో పాటు సగటు పౌరుడి సంక్షేమం కోసం మన్మోహన్‌ సింగ్‌ చేసిన కృషి వల్లే భారతదేశం ప్రపంచ శక్తిగా ఎదిగిందని వివరించింది. విద్యావేత్తగా, ఆర్థికవేత్తగా, సంస్కరణకర్తగా మన్మోహన్‌ సింగ్‌ దేశానికి అందించిన సేవలు చిరస్థాయిగా నిలిచిపోతాయని సీడబ్ల్యూసీ తీర్మానం చేసింది.

Updated Date - Dec 28 , 2024 | 06:01 AM