Manipur: బీజేపీ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్న ఎన్‌పీపీ
ABN, Publish Date - Nov 17 , 2024 | 09:32 PM
2023 నుంచి మణిపూర్‌లో మైతెయి, కుకీ జాతుల మధ్య అల్లర్లు చెలరేగాయి. నాటి నుంచి నేటి వరకు 250 మందికి పైగా మరణించారు. 60 వేల మంది ప్రజలు మణిపూర్ నుంచి ఇతర ప్రాంతాలకు తరలిపోయారు.
ఢిల్లీ, నవంబర్ 17: మణిపూర్‌లో మైతెయి - కుకి జాతుల మధ్య హింస మళ్లీ చెలరేగింది. దీంతో బీరెన్ సింగ్ ప్రభుత్వ నేతృత్వంలో రాష్ట్రంలో శాంతి భద్రతలు ఘోరం విఫలమైయ్యాయని నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్‌పీపీ) భావించింది. దాంతో ప్రభుత్వానికి తమ మద్దతు ఉపసంహరించుకుంటున్నట్లు ఎన్‌పీపీ అధినేత కార్నార్డ్ సంగ్మా ప్రకటించారు. ఈ మేరకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు ఎన్‌పీపీ అధ్యక్షుడు సంగ్మా ఆదివారం లేఖ ద్వారా తెలిపారు.
Also Read:రైతులు.. ధాన్యం విక్రయించేందుకు వాట్సాప్ నెంబర్ ఇదిగో..
రాష్ట్రంలో జాతుల మధ్య హింసతో శాంతి భద్రతల పరిస్థితిపై తీవ్ర ఆందోళన నెలకొందన్నారు. ఈ సంక్షోభాన్ని పరిష్కరించడంలో బీరెన్ సింగ్ సర్కార్ ఘోరంగా విఫలమైందని ఆ లేఖలో ఆయన స్పష్టం చేశారు. తమ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని చెప్పారు.
Also Read: Hyderabad: గచ్చిబౌలి స్టేడియం వేదికగా.. రేపే ఫుట్ బాల్ మ్యాచ్
మరోవైపు ఎన్‌పీపీ మద్దతు ఉపసంహరించినా.. మణిపూర్‌లో బీజేపీ ప్రభుత్వానికి వచ్చిన ఢోకా అయితే ఏమీ లేదన్నది సుస్ఫష్టం. ఎందుకంటే మణిపూర్‌లో బీజేపీకి సంపూర్ణ మెజార్టీ ఉందన్న సంగతి తెలిసిందే. అదీకాక బీజేపీతో కుకి పీపుల్స్ అలియన్స్ ఎన్‌పీపీ జత కట్టి ఏడాది దాటింది. ఎన్‌పీపీకి ఏడుగురు ఎమ్మెల్యేల బలం ఉంది.
Also Read: UttarPradesh: పసి కందుల సజీవ దహనానికి కారణమిదే..
మణిపూర్ రాష్ట్రంలోని జాతులు రెండుగా విడిపోయాాయి. ఇంపాల్ వ్యాలీని మైతెయి తెగ నియంత్రిస్తుంది. ఇక కుకీలు పర్వత ప్రాంతాలలో నివసిస్తారు. రాష్ట్ర జనాభాలో మైతెయిలు 53 శాతం ఉన్నారు. అలాగే కుకీలు, నాగాలు 40 శాతం మేర ఉన్నారు. గత సోమవారం నిర్వాసితుల శిబిరం నుంచి ఆరుగురు మైతెయి తెగ వ్యక్తులు కనిపించకుండా ఉన్నారు. వారిలో ముగ్గురు మహిళలు, ముగ్గురు చిన్నారులు ఉన్నారు.
Also Read: ఎన్నికల ప్రచారంలో నవనీత్ కౌర్‌పై దాడి
శనివారం వీరి మృతదేహాలు అసోం, మణిపూర్ సరిహద్దుల్లోని జిరీ, బరాక్ నదులు కలిసే సంగమ ప్రదేశంలో లభ్యమైనాయి. దీంతో మైతెయి తెగ వారు ఆగ్రహించి.. నిరసనలు, ఆందోళనలు చేపట్టారు. అందులోభాగంగా సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేల నివాసాలపై దాడికి దిగారు. దాంతో పోలీసులు, ఆందోళనకారుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.
Also Read: వాహన కొనుగోలు దారులకు గుడ్ న్యూస్
అంతటితో ఆగకుండా వారు.... శనివారం అర్థరాత్రి జిరిబామ్ పట్టణంలోని పలు నివాసాలు, ప్రార్థన మందిరాలపై దాడులకు దిగారు. దీంతో శాంతిభద్రతలు పూర్తిగా అదుపు తప్పాయి. దీంతో పలు ప్రాంతాల్లో కర్ప్యూ విధించారు. ప్రభుత్వం సెల్ పోన్లు, ఇంటర్నెట్ సేవలను నిలిపివేసింది.
Also Read: ఐదు రోజుల పాటు భారీ వర్షాలు
Also Read: చిన్న ఉసిరి వల్ల ఇన్ని లాభాలున్నాయా..?
2023 నుంచి మణిపూర్‌లో మైతెయి, కుకీ జాతుల మధ్య అల్లర్లు చెలరేగాయి. నాటి నుంచి నేటి వరకు 250 మందికి పైగా మరణించారు. 60 వేల మంది ప్రజలు మణిపూర్ నుంచి ఇతర ప్రాంతాలకు తరలిపోయారు. మరోవైపు మణిపూర్‌లో నెలకొన్న తాజా పరిస్థితులపై సోమవారం ఢిల్లీలో కేంద్ర హోం శాఖ ఉన్నతాధికారులు కీలక సమావేశం నిర్వహిస్తుంది. ఈ సమావేశానికి వివిధ విభాగాల అధిపతులు హాజరుకానున్నారు.
For National news And Telugu News
Updated Date - Nov 17 , 2024 | 10:02 PM