ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

కారు వేగం తగ్గించమన్నందుకు... కానిస్టేబుల్‌ను ఢీకొట్టి ఈడ్చుకెళ్లిన డ్రైవర్‌

ABN, Publish Date - Sep 30 , 2024 | 05:27 AM

దేశ రాజధాని ఢిల్లీ రహదారులపై మరో దారుణం చోటుచేసుకుంది. ఓ కారు అతివేగంగా పోలీసు కానిస్టేబుల్‌ను ఢీకొట్టి ఈడ్చుకెళ్లింది. తలకు తీవ్ర గాయాలైన అతను ఆస్పత్రికి తీసుకెళ్లేలోపే మరణించాడు.

న్యూఢిల్లీ, సెప్టెంబరు 29: దేశ రాజధాని ఢిల్లీ రహదారులపై మరో దారుణం చోటుచేసుకుంది. ఓ కారు అతివేగంగా పోలీసు కానిస్టేబుల్‌ను ఢీకొట్టి ఈడ్చుకెళ్లింది. తలకు తీవ్ర గాయాలైన అతను ఆస్పత్రికి తీసుకెళ్లేలోపే మరణించాడు. వేగం తగ్గించమని ఆ కారు డ్రైవర్‌కు చెప్పడమే ఆ పోలీసు తప్పిదమైంది. ఒళ్లు గగుర్పొడిచే ఈ ఘోరం సీసీటీవీ కెమెరాలో రికార్డు అయింది. సందీప్‌ (30) అనే కానిస్టేబుల్‌ మఫ్టీలో నాంగ్లోయీ ప్రాంతంలో మోటారు సైకిల్‌పై గస్తీ నిర్వహిస్తుండగా వెనుక నుంచి వ్యాగన్‌-ఆర్‌ కారు అతివేగంగా వస్తుండడాన్ని గమనించాడు. నెమ్మదిగా వెళ్లమని సైగ చేసి.. ముందుకు కదిలాడు. కానీ, ఆ కారు డ్రైవర్‌ మరింత వేగంగా పోనిచ్చి.. మోటారుసైకిల్‌పై ఉన్న సందీప్‌ను ఢీకొట్టి ఈడ్చుకెళ్లాడు.

దాంతో అతని తలకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు ఆస్పత్రికి తీసుకెళ్లేలోపే అతను ప్రాణాలు కోల్పోయాడు. ఆ కారులోని ఇద్దరు వ్యక్తులూ కారును వదిలేసి పరారయ్యారు. హత్య కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. నిందితులిద్దరిలో ఒకరు అక్రమ మద్యం వ్యాపారం చేస్తుంటాడని సమాచారం. కాగా, ఢిల్లీలో రోడ్డు ప్రమాదాలపై వాగ్వాదాలు హింసాత్మక ఘటనలకు దారితీసున్నాయి. గత నెల ఫరీదాబాద్‌లో తమ కారును తగిలాడనే కోపంతో ఆటోడ్రైవర్‌ను కొందరు వ్యక్తులు కొట్టి చంపారు. జూలైలో.. ఇలాగే రోడ్డుపై గొడవతో ఓ వ్యక్తి మోటారుసైకిల్‌పై ఇద్దరు పిల్లలతో కలిసి వెళుతున్న దంపతులపై కాల్పులు జరిపాడు. బుల్లెట్‌ తగిలి 30 ఏళ్ల మహిళ చనిపోయింది.

Updated Date - Sep 30 , 2024 | 05:27 AM