ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Karnataka: మాండ్యలో మత ఘర్షణలపై ప్రభుత్వం సీరియస్.. పోలీసులపై వేటు

ABN, Publish Date - Sep 13 , 2024 | 06:31 PM

కర్ణాటకలోని మాండ్య జిల్లాలో నాగమంగళ పట్టణంలో వినాయకుడి ఊరేగింపుపై రాళ్ల దాడి జరిగింది. అనంతరం రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘటనపై ప్రభుత్వం సీరియస్ అయింది. ఎస్ఐపై సస్పెన్షన్ వేటు వేసింది. ఈ ఘటనకు సంబంధించి 55 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

బెంగళూరు, సెప్టెంబర్ 13: కర్ణాటకలోని మాండ్య జిల్లాలో నాగమంగళ పట్టణంలో నవరాత్రులు సందర్బంగా వినాయకుడి ఊరేగింపు నేపథ్యంలో మత ఘర్షణలు తలెత్తడంపై ప్రభుత్వం సీరియస్ అయింది. వినాయకుడి ఊరేగింపు సందర్భంగా పటిష్టమైన భద్రత చర్యలు చేపట్టి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని ప్రభుత్వం అభిప్రాయపడింది. అలాగే నిఘా విభాగం సైతం విఫలమైందని ఆరోపణలు వెల్లువెత్తాయి.

Vijayawada Floods: మరో సారి స్పందించిన బుద్దా వెంకన్న


ఈ నేపథ్యంలో స్థానిక ఎస్ఐ అశోక్‌ కుమార్‌పై సస్పెన్షన్ వేటు వేసింది. అలాగే నిఘా విభాగానికి చెందిన ఉన్నతాధికారి శరత్ చంద్రని బదిలీ చేసింది. అతడి స్థానంలో కొత్తగా హేమంత్ నింబాల్కర్‌ను నియమించింది. మరోవైపు నాగమంగళ పట్టణంలో ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోకుండా భారీగా పోలీసులను మోహరించారు. మరోవైపు ప్రస్తుతం పట్టణ పరిసర ప్రాంతాల్లో శాంతి భద్రతలు పూర్తిగా అదుపులోనే ఉన్నాయని జిల్లా ఉన్నతాధికారులు స్పష్టం చేశారు.

Also Read: AP Rains: వైసీపీకి గట్టి కౌంటర్ ఇచ్చిన ఐటీడీపీ


బుధవారం నాగమంగళ పట్టణంలో.. వినాయకుడి ఊరేగింపు జరుగుతుంది. ఈ ఊరేగింపు మసీద్ సమీపంలోకి వచ్చింది. అకస్మాత్తుగా ఈ ఊరేగింపుపై కొందరు వ్యక్తులు రాళ్ల దాడికి దిగారు. దీంతో రెండు వర్గాల మధ్య తొపులాట జరిగింది. అనంతరం తమకు న్యాయం చేయాలంటూ పోలీస్‌స్టేషన్ ఎదుట వినాయకుడి విగ్రహాన్ని నిలిపి ఓ వర్గం ఆందోళనకు దిగింది. అదే సమయంలో పలువురు ఆందోళనకారులు షాపులతోపాటు రహదారిపై వాహనాలకు నిప్పు పెట్టారు.

Also Read: YS Jagan: బాలినేని శ్రీనివాసరెడ్డితో విడదల రజినీ చర్చలు


దాంతో 52 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో వారి బంధువులు పోలీస్ స్టేషన్ ఎదుట నిరసనకు దిగారు. తమ వాళ్లు అమయాకులన్నారు. వాళ్లను కారణం లేకుండా అదుపులోకి తీసుకున్నారని వారి బంధువులు ఆరోపించారు. అలాగే ఈ కేసుకు సంబంధించి మరో ముగ్గురుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో పోలీసుల అదుపులో ఉన్న వారి సంఖ్య 55కి పెరిగింది. వారందరికి 14 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది.

Also Read: Arvind Kejriwal: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు బెయిల్.. ఆప్ నేతల్లో వెల్లివిరిసిన ఆనందం


మరోవైపు నాగమంగళ పట్టణంలో మత ఘర్షణలపై స్థానిక ఎంపీ, కేంద్ర ఉక్కు శాఖ మంత్రి జేడీ కుమార స్వామి స్పందించారు. ఈ ఘటనను ఆయన తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ఈ సందర్భంగా ఆయన విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో శాంతి భద్రత పరిస్థితికి ఈ ఘటన అద్దం పడుతుందనేందుకు ఈ ఘటనే సాక్ష్యామని కేంద్ర మంత్రి అభిప్రాయపడ్డారు. శుక్రవారం నాగమంగళలో మంత్రి జేడీ కుమార స్వామి పర్యటించారు.

Also Read: Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ స్కాంలో నాటి ఈడీ సమన్లు నుంచి నేటి బెయిల్ వరకు..


ప్రశాంతంగా వినాయకుడి ఊరేగింపు వెళ్తుండా.. ఈ రాళ్లు ఎక్కడి నుంచి వచ్చాయని ఈ సందర్బంగా ఆయన సందేహం వ్యక్తం చేశారు. నవరాత్రులు సందర్భంగా బదరికొప్పలు గ్రామం నుంచి వినాయకుడిని ఊరేగింపుగా తీసుకువెళ్తున్నారు. ఆ క్రమంలో నాగమంగళ పట్టణంలొని మసీద్ వద్దకు రాగానే ఈ ఊరేగింపుపై ఓ వర్గం రాళ్ల దాడికి దిగిన సంగతి తెలిసిందే.

Read More National News and Latest Telugu New

Updated Date - Sep 13 , 2024 | 07:34 PM

Advertising
Advertising