Rahul Gandhi: రాహుల్‌కు యూపీ కోర్టు సమన్లు
ABN, Publish Date - Dec 14 , 2024 | 03:44 AM
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి లక్నోలోని స్థానిక కోర్టు సమన్లు జారీ చేసింది. జనవరి 10న హాజరుకావాలని ఆదేశించింది.
లక్నో, డిసెంబరు 13: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి లక్నోలోని స్థానిక కోర్టు సమన్లు జారీ చేసింది. జనవరి 10న హాజరుకావాలని ఆదేశించింది. సావర్కర్‌పై అనుచిత వ్యాఖ్యలతో రాహుల్ సమాజంలో సామరస్యాన్ని దెబ్బతీసేలా వ్యవహరించారంటూ న్యాయవాది నృపేంద్ర పాండే క్రిమినల్ కంప్లైంట్ దాఖలు చేశారు. దీనిపై స్పందించిన న్యాయమూర్తి అలోక్ వర్మ ఈ మేరకు సమన్లు జారీ చేశారు. భారత్ జోడో యాత్రలో భాగంగా 2022 నవంబరు 17న మహారాష్ట్ర అకోలాలో విలేకరుల సమావేశంలో సావర్కర్‌పై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై ఈ కేసు నమోదైంది. సావర్కర్ బ్రిటీషువారికి సేవకుడిలా వ్యవహరించడమే గాక పెన్షన్ కూడా తీసుకున్నారని రాహుల్ నాడు వ్యాఖ్యానించారు.
Updated Date - Dec 14 , 2024 | 03:44 AM