ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

PM Modi: మోదీ ధ్యానం‌పై ఈసీకి లేఖ

ABN, Publish Date - May 30 , 2024 | 03:54 PM

సార్వత్రిక ఎన్నికల తుది దశ పోలింగ్ జరగనున్న వేళ.. కన్నియాకుమారిలో ప్రధాని నరేంద్ర మోదీ ధ్యానం అంశం రాజకీయంగా కాక రేపుతోంది. బీజేపీపై ప్రతిపక్షాలు ముకుమ్మడిగా విమర్శనాస్త్రాలు సంధిస్తున్నాయి. అయితే ప్రధాని మోదీ ధ్యానం అంశాన్ని మీడియాలో ప్రసారం చేయవద్దంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి సీపీఐ (ఎం) విజ్జప్తి చేసింది.

చెన్నై, మే 30: సార్వత్రిక ఎన్నికల తుది దశ పోలింగ్ జరగనున్న వేళ.. కన్నియాకుమారిలో ప్రధాని నరేంద్ర మోదీ ధ్యానం అంశం రాజకీయంగా కాక రేపుతోంది. బీజేపీపై ప్రతిపక్షాలు ముకుమ్మడిగా విమర్శనాస్త్రాలు సంధిస్తున్నాయి. అయితే ప్రధాని మోదీ ధ్యానం అంశాన్ని మీడియాలో ప్రసారం చేయవద్దంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి సీపీఐ (ఎం) విజ్జప్తి చేసింది. ఈ మేరకు ఆ పార్టీ తమిళనాడు రాష్ట్ర కార్యదర్శి కె. బాలకృష్ణన్.. ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. మోదీ ధ్యానం అంశాన్ని ఓ వేళ మీడియాలో ప్రసారం చేస్తే.. అది ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించడమే అవుతుందన్నారు.

Also Read: ప్రధాని మోదీ సభలో ‘ఆమె’ ఎవరు?


అంతేకాదు ఇది బీజేపీకి లాభం చేకూరుస్తుందని ఈసీకి రాసిన లేఖలో ఆయన స్పష్టం చేశారు. మోదీ ధాన్యం అంశాన్ని అటు మీడియాలో ఇటు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తే.. ప్రధాని మోదీకి, ఆయన పార్టీకి పెద్ద ప్రచారం లభించినట్లు అవుతుందని పేర్కొన్నారు. మరోవైపు ఇదే అంశంపై కాంగ్రెస్ పార్టీతోపాటు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ సైతం స్పందించిన సంగతి తెలిసిందే. మోదీ ధ్యానం అంశం మీడియాలో ప్రసారమైతే.. ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తానని ఇప్పటికే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పష్టం చేశారు. ధ్యానం చేసుకునే వారు ఎవరైనా కెమెరా తీసుకు వెళ్తారా? అంటూ ఆమె వ్యంగ్యంగా ప్రశ్నించారు.

Also Read: భారీగా పెరిగిన రాజకీయ పార్టీలు


ఏడో దశ ఎన్నికల ప్రచారం గురువారం సాయంత్రంతో ముగియనుంది. ఆ క్రమంలో తమిళనాడులోని కన్నియాకుమారిలో వివేకానంద శిలా స్మారకం వద్ద 48 గంటలపాటు ధ్యానం చేస్తానని ప్రధాని మోదీ ఇటీవల ప్రకటించారు. దాంతో రాజకీయంగా దుమారం రేగింది. ఇదంతా ఎన్నికల్లో గెలుపు కోసం చేస్తున్నారంటూ ప్రధాని మోదీపై ప్రతిపక్ష పార్టీలు ఆరోపణలు గుప్పించాయి.

Also Read: ఆందోళనలను ప్రేరేపించేలా సజ్జల వ్యాఖ్యలు: దేవినేని ఉమ


అంతేకాదు జూన్ 4వ తేదీ ఫలితాలు వెలువడే రోజు వరకు ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుందని.. ఆ తర్వాత ఎవరు ఎక్కడ ధ్యానం చేసుకున్నా తమకు అభ్యంతరం లేదని ఇప్పటికే ప్రతిపక్ష రాజకీయ పార్టీల నేతలు స్పష్టం చేశారు. ఇంకోవైపు ప్రధాని మోదీ మరికాసేపట్లో కన్నియాకుమారికి వస్తున్నారు. ఈ నేపథ్యంలో 2 వేల మంది పోలీసులతో భద్రతను కట్టుదిట్టం చేశారు.

Also Read: తెలంగాణ కొత్త లోగో ఆవిష్కరణ వాయిదా.. ఎందుకంటే..?

Read Latest Telangana News and National News

Read Latest AP News and Telugu News

Updated Date - May 30 , 2024 | 05:54 PM

Advertising
Advertising