అజయ్ తవాడే.. ఓ ‘క్రిమినల్’ డాక్టర్
ABN, Publish Date - Jun 14 , 2024 | 04:15 AM
పుణె కారు ప్రమాదం కేసులో దిగ్ర్భాంతికర విషయాలు ఇంకా వెలుగులోకి వస్తున్నాయి. మే 19న పుణెకు చెందిన 17 ఏళ్ల కుర్రాడు మద్యం మత్తులో అతి నిర్లక్ష్యంగా కారును నడిపి ఇద్దరు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లను బలిగొన్న సంగతి తెలిసిందే. ఈ ఘటనలో కుర్రాడి రక్త నమూనాల స్థానంలో అతడి తల్లి రక్త నమూనాలను ఉంచి కేసును తప్పుదోవ పట్టించేందుకు చూశాడు ససూన్ ఆస్పత్రి ఫోరెన్సిక్ విభాగాధిపతి డాక్టర్ అజయ్ తవాడే.
పుణె కారు ప్రమాదం కేసులోనే కాదు..
అతనిపై ఇంకా అనేక ఆరోపణలు
పుణె, జూన్ 13: పుణె కారు ప్రమాదం కేసులో దిగ్ర్భాంతికర విషయాలు ఇంకా వెలుగులోకి వస్తున్నాయి. మే 19న పుణెకు చెందిన 17 ఏళ్ల కుర్రాడు మద్యం మత్తులో అతి నిర్లక్ష్యంగా కారును నడిపి ఇద్దరు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లను బలిగొన్న సంగతి తెలిసిందే. ఈ ఘటనలో కుర్రాడి రక్త నమూనాల స్థానంలో అతడి తల్లి రక్త నమూనాలను ఉంచి కేసును తప్పుదోవ పట్టించేందుకు చూశాడు ససూన్ ఆస్పత్రి ఫోరెన్సిక్ విభాగాధిపతి డాక్టర్ అజయ్ తవాడే.
క్రైం బ్రాంచ్ పోలీసులు విచారణలో ఇతడి నేర నేపథ్యం బయటపడుతోంది. డాక్టర్ అజయ్ గతంలోనూ పలు కేసుల్లో రక్త నమూనాల మార్పిడికి పాల్పడినట్లు తేలింది. ఇందుకోసం పశ్చిమ మహారాష్ట్రలోని 4జిల్లాల్లో బ్రోకర్లు, డాక్టర్లతో అతడు ముఠా ఏర్పాటు చేశాడు. ధనిక కుటుంబాలకు చెందిన ఎవరైనా మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడితే వీరు రంగంలోకి దిగుతారు. వారి రక్త నమూనాలను మార్చేస్తారు. రెండేళ్ల నుంచి వీరు ఇలా చేస్తున్నారు. కొన్ని ఉదంతాల్లో రూ.5లక్షల వరకు వసూలు చేశారు. డాక్టర్ అజయ్‌కు డ్రగ్స్, కిడ్నీ మార్పిడి కేసుల్లోనూ ప్రమేయంఉన్నట్లుగా గతంలో ఆరోపణలు వచ్చాయి.
Updated Date - Jun 14 , 2024 | 08:10 AM