ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

CSI : నిశ్శబ్ద హంతకి కొలెస్ట్రాల్‌

ABN, Publish Date - Jul 06 , 2024 | 04:14 AM

హెచ్చుతగ్గులను(డిస్లిపిడెమియా) నివారించేందుకు కార్డియాలజికల్‌ సొసైటీ ఆఫ్‌ ఇండియా(సీఎ్‌సఐ) గురువారం మార్గదర్శకాలను విడుదల చేసింది. డిస్లిపిడెమియా నిశ్శబ్ద హంతకి ....

  • అదుపునకు సీఎస్‌ఐ మార్గదర్శకాలు

న్యూఢిల్లీ, జూలై 5: రక్తంలో కొలెస్ట్రాల్‌ స్థాయుల అసాధారణ హెచ్చుతగ్గులను(డిస్లిపిడెమియా) నివారించేందుకు కార్డియాలజికల్‌ సొసైటీ ఆఫ్‌ ఇండియా(సీఎ్‌సఐ) గురువారం మార్గదర్శకాలను విడుదల చేసింది. డిస్లిపిడెమియా నిశ్శబ్ద హంతకి వంటిదని సీఎ్‌సఐ అధ్యక్షుడు డాక్టర్‌ ప్రతా్‌పచంద్ర రథ్‌ తెలిపారు.

అధిక రక్తపోటు, మధుమేహం వంటి సమస్యల తరహాలో దీని లక్షణాలు ముందుగా బయటపడవని చెప్పారు. పక్షవాతం, గుండె సంబంధిత వ్యాధులకు దారితీస్తుందన్నారు. సీఎ్‌సఐ మార్గదర్శకాల ప్రకారం..గుండె జబ్బులు వంశపారంపర్యంగా వస్తున్న కుటుంబాలకు చెందినవారు తొలి లిపిడ్‌ ప్రొఫైల్‌ను 18 ఏళ్లు లేదా అంతకుంటే తక్కువ వయస్సులోనే చేయించుకోవాలి.

సాధారణ ప్రజలు, ముప్పు తక్కువగా ఉన్నవారు ఎల్‌డీఎల్‌(చెడు కొలెస్ట్రాల్‌)-సీ స్థాయులను 100 ఎంజీ/డీఎల్‌కు, నాన్‌-హెచ్‌డీఎల్‌(మంచి కొలెస్ట్రాల్‌)-సీ స్థాయులను 130 ఎంజీ/డీఎల్‌కు తక్కువగా ఉండేలా చూసుకోవాలి.

మధుమేహం, రక్తపోటు వంటి సమస్యలు ఉన్నవార) ఎల్‌డీఎల్‌-సీ స్థాయులు 70 ఎంజీ/డీఎల్‌కు, నాన్‌-హెచ్‌డీఎల్‌-సీ స్థాయులు 100 ఎంజీ/డీఎల్‌కు లోపు ఉండేలా జాగ్రత్త వహించాలి. ఆహారంలో చక్కెర, కార్బొహైడ్రేట్‌లను తక్కువగా తీసుకోవాలి. గుండె ఆరోగ్యాన్ని కాపాడే యోగా, వ్యాయామం వంటివి చేయాలి.

Updated Date - Jul 06 , 2024 | 04:14 AM

Advertising
Advertising