ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

విద్యార్థుల సొమ్ము కొట్టేసిన సైబర్‌ నేరగాళ్లు

ABN, Publish Date - Nov 17 , 2024 | 04:06 AM

సైబర్‌ నేరగాళ్ల దృష్టి విద్యార్థుల పైనా పడింది. ట్యాబ్స్‌ కొనుగోలు కోసం వారి బ్యాంకు ఖాతాల్లో పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వం జమ చేసిన సొమ్మును అక్రమ మార్గాల్లో బదిలీ చేయించుకున్నారు.

కోల్‌కతా, నవంబరు 16: సైబర్‌ నేరగాళ్ల దృష్టి విద్యార్థుల పైనా పడింది. ట్యాబ్స్‌ కొనుగోలు కోసం వారి బ్యాంకు ఖాతాల్లో పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వం జమ చేసిన సొమ్మును అక్రమ మార్గాల్లో బదిలీ చేయించుకున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో 10, 12వ తరగతి విద్యార్థులకు ట్యాబ్‌లు అందించేందుకు పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వం తరుణర్‌ స్వప్నో పథకాన్ని అమలు చేస్తోంది. మొత్తం 16లక్షల మంది విద్యార్థుల ఖాతాల్లో రూ.10వేల వంతున జమ చేస్తోంది. అయితే అందులో 1,911 మంది విద్యార్థుల ఖాతాల నుంచి సైబర్‌ నేరగాళ్లు సొమ్మును అపహరించినట్టు పోలీసులు గుర్తించారు. దీనిపై 93 కేసులు నమోదు చేసి, 11 మందిని అరెస్టు చేసినట్టు శుక్రవారం తెలిపారు. నేరగాళ్లు మహారాష్ట్ర, ఝార్ఖండ్‌, రాజస్థాన్‌ ఇతర రాష్ట్రాల నుంచి వ్యవహారాన్ని నడిపినట్టు చెప్పారు.

Updated Date - Nov 17 , 2024 | 04:07 AM