ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Hemant Soren: బీజేపీకి సమయం ఆసన్నమైంది

ABN, Publish Date - Jun 29 , 2024 | 05:50 PM

రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ పూర్తిగా తుడిచి పెట్టుకు పోతుందని ఝార్ఖండ్ ముక్తి మోర్చ నేత, మాజీ సీఎం హేమంత్ సోరెన్ జోస్యం చెప్పారు. శనివారం ఝార్ఖండ్ రాజధాని రాంచీలో తన పార్టీ మద్దతుదారులతో ఆయన సమావేశమయ్యారు.

JMM Leader, Ex CM Hemant Soren

రాంచీ, జూన్ 29: రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ పూర్తిగా తుడిచి పెట్టుకు పోతుందని ఝార్ఖండ్ ముక్తి మోర్చ నేత, మాజీ సీఎం హేమంత్ సోరెన్ జోస్యం చెప్పారు. శనివారం ఝార్ఖండ్ రాజధాని రాంచీలో తన పార్టీ మద్దతుదారులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్బంగా మాజీ సీఎం హేమంత్ సోరెన్ మాట్లాడుతూ.. తమపై కుట్ర పన్నిన వారికి తగిన విధంగా సమాధానం చెబుదామని తన మద్దతుదారులకు ఆయన పిలుపు నిచ్చారు. బీజేపీని శవపేటికలో పెట్టి.. పుడ్చి పెట్టే సమయం ఆసన్నమైందన్నారు.

Also Read: Assam: యూనివర్సిటీలో మార్క్‌షీట్ స్కాం.. తొమ్మిది మంది అరెస్ట్


భారతదేశంలో సామాజిక నిర్మాణాన్ని నాశనం చేసేందుకు బీజేపీ ప్రయత్నించిందన్నారు. ఈ విషయాన్ని దేశ ప్రజలు గమనించారని తెలిపారు. అందుకే ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి ప్రజలు తగిన గుణపాఠం చెప్పారన్నారు. అయితే ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలవాలని బీజేపీ పగటి కలలు కంటుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లోని అదివాసీ ముఖ్యమంత్రులను రబ్బర్ స్టాంపులుగా మార్చిందని ఆయన మండిపడ్డారు.

Also Read: Arvind Kejriwal: బీజేపీ కేంద్ర కార్యాలయం వద్ద ‘ఆప్’ ఆందోళన


ఝార్ఖండ్ అసెంబ్లీకి ఎన్నికలు అనుకున్న సమయం కంటే ముందే నిర్వహించనున్నారని చెప్పారు. అందుకు సంబంధించిన సమాచారం తన వద్ద ఉందని ఆయన పేర్కొన్నారు. అందుకు తాము సిద్దంగా ఉన్నామని హేమంత్ సోరెన్ ఈ సందర్బంగా స్పష్టం చేశారు. మనీ లాండరింగ్ కేసులో బీర్సా ముండా జైలు నుంచి బెయిల్‌పై విడుదలైన కొన్ని గంటలకే హేమంత్ సోరెన్ ఈ తరహా వ్యాఖ్యలు చేయడం ఆ రాష్ట్రంలో రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.

Also Read: Ayodhya: ఆరుగురు ఉన్నతాధికారులపై సస్పెన్షన్ వేటు


మరోవైపు ఈ ఏడాది జనవరి 5వ తేదీన భూ కుంభకోణం కేసులో మనీ ల్యాండరింగ్ వ్యవహరంలో జేఎంఎం నేత, మాజీ సీఎం హేమంత్ సోరెన్‌ను ఈడీ అరెస్ట్ చేసింది. దీంతో దాదాపు 5 నెలలుగా ఆయన బిర్సా ముండా జైల్లో ఉన్నారు. ఆ క్రమంలో పలుమార్లు తనకు మధ్యంతర బెయిల్ మంజురు చేయాలంటూ పలు కోర్టులను ఆయన ఆశ్రయించారు. కానీ ఆయనకు బెయిల్ మాత్రం లభించలేదు.

Also Read: Viral Video: గోదావరిలో దూకిన మహిళ..సోషల్ మీడియాలో వైరల్


అయితే ఝార్ఖండ్ హైకోర్ట్ హేమంత్ సోరెన్‌కు శుక్రవారం ఉదయం బెయిల్ మంజూరు చేసింది. దీంతో నిన్న ఆయన జైలు నుంచి విడుదలయ్యారు. ఇంకోవైపు ఝార్ఖండ్‌లో మొత్తం 18 లోక్‌సభ స్థానాలున్నాయి. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ 8 స్థానాలు గెలుచుకోంది. సోరెన్ పార్టీ జేఎంఎం మూడు ఎంపీ స్థానాలు, కాంగ్రెస్ రెండు, ఏజేఎస్‌యూ ఒక్క ఎంపీ స్థానాన్ని కైవసం చేసుకున్నాయి. ఇక ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు ఈ ఏడాది చివరలో హర్యానా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలతోపాటు జరగనున్న సంగతి తెలిసిందే.

Also Read: Owaisi: నివాసంపై దాడి.. కేసు నమోదు చేసిన పోలీసులు

Latest Telugu News And National News

Updated Date - Jun 29 , 2024 | 05:52 PM

Advertising
Advertising