ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Rajnath Singh : పీవోకే ప్రజలారా.. భారత్‌లోకి రండి

ABN, Publish Date - Sep 09 , 2024 | 04:01 AM

పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ (పీవోకే) ప్రజలు భారత్‌లోకి రావాలని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ పిలుపునిచ్చారు. సొంత మనుషుల్లాగా చూసుకుంటామని ప్రకటించారు.

  • సొంతవారిలా చూసుకుంటాం

  • కశ్మీర్‌ ప్రచారంలో రాజ్‌నాథ్‌సింగ్‌

జమ్మూ, సెప్టెంబరు 8: పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ (పీవోకే) ప్రజలు భారత్‌లోకి రావాలని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ పిలుపునిచ్చారు. సొంత మనుషుల్లాగా చూసుకుంటామని ప్రకటించారు. పాకిస్థాన్‌ వారిని విదేశీ పౌరులుగానే పరిగణిస్తోందని వ్యాఖ్యానించారు. పీవోకేను విదేశం అని పేర్కొంటూ పాక్‌ అదనపు సొలిసిటర్‌ జనరల్‌ సమర్పించిన అఫిడవిట్‌ దీనికి నిదర్శనమని అన్నారు. కశ్మీర్‌లోని రామ్‌బన్‌ అసెంబ్లీ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి రాకేశ్‌ సింగ్‌ ఠాకూర్‌కు మద్దతుగా రాజ్‌నాథ్‌ ఆదివారం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఆర్టికల్‌ 370 రద్దు తర్వాత కశ్మీర్‌లో ఊహించనంతగా మార్పులు వచ్చాయని.. యవత చేతుల్లో తుపాకులు బదులు ల్యాప్‌టా్‌పలు కనిపిస్తున్నాయని అన్నారు. కాంగ్రె్‌స-నేషనల్‌ కాన్ఫరెన్స్‌ కూటమి ఆర్టికల్‌ 370ని పునరుద్ధరిస్తామని ప్రకటిస్తోందని.. బీజేపీ ఉన్నంత కాలం అది సాధ్యం కాదని స్పష్టం చేశారు.

Updated Date - Sep 09 , 2024 | 04:05 AM

Advertising
Advertising