ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Delhi : మోదీ @10 కోట్లు

ABN, Publish Date - Jul 15 , 2024 | 04:15 AM

10 కోట్లు! ప్రధాని మోదీని ‘ఎక్స్‌’లో ఫాలో అవుతున్నవారి సంఖ్య ఇది. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా(13 కోట్లు) తర్వాత ఈ మైలురాయిని చేరుకున్న మరో నేతగా, ప్రభావవంతమైన వ్యక్తిగా మోదీ నిలిచారు.

  • ‘ఎక్స్‌’లో ప్రధానిని ఫాలో అవుతున్న వాళ్ల సంఖ్య

న్యూఢిల్లీ, జూలై 14: 10 కోట్లు! ప్రధాని మోదీని ‘ఎక్స్‌’లో ఫాలో అవుతున్నవారి సంఖ్య ఇది. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా(13 కోట్లు) తర్వాత ఈ మైలురాయిని చేరుకున్న మరో నేతగా, ప్రభావవంతమైన వ్యక్తిగా మోదీ నిలిచారు. ప్రపంచ ప్రసిద్ధి గాంచిన పలువురు సెలబ్రిటీలు, క్రీడాకారుల కంటే మోదీనే ‘ఎక్స్‌’లో ఎక్కువ మంది ఫాలో అవుతుండటం విశేషం.

అలాగే తన రాజకీయ ప్రత్యర్థులైన రాహుల్‌గాంధీ(2.64 కోట్లు), కేజ్రీవాల్‌(2.75 కోట్లు), అఖిలేశ్‌(1.90 కోట్లు), మమతాబెనర్జీ(74 లక్షలు) వంటి వారి కంటే ఫాలోవర్స్‌ విషయంలో ఆయన అందనంత ఎత్తుకు ఎదిగిపోయారు. అదేవిధంగా ప్రముఖ క్రీడాకారులు విరాట్‌ కోహ్లి(6.4 కోట్లు), నేమర్‌ జూనియర్‌(6.3 కోట్లు), లెబ్రోన్‌ జేమ్స్‌(5.2 కోట్లు)లను అలాగే టేలర్‌ స్విఫ్ట్‌(9.5 కోట్లు), లేడీ గాజా(8.3 కోట్లు), కిమ్‌ కర్‌దాషియన్‌(7.52 కోట్లు) వంటి సెలబ్రిటీలను సైతం అధిగమించారు. 10 కోట్ల మార్క్‌ చేరుకున్న సందర్భంగా మోదీ తన సంతోషాన్ని వ్యక్తం చేశారు.

Updated Date - Jul 15 , 2024 | 04:15 AM

Advertising
Advertising
<