ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Air Pollution: వామ్మో.. మరింత విషమంగా ఢిల్లీ వాయు కాలుష్యం.. ఏ స్థాయికి చేరిందంటే..

ABN, Publish Date - Nov 14 , 2024 | 10:32 AM

ఢిల్లీలో వాయుకాలుష్యం మరింత విషపూరితంగా తయారైంది. గురువారం ఉదయం ఢిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో దట్టమైన పొగ ఆవరించింది. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (CPCB) ప్రకారం ఆనంద్ విహార్ ప్రాంతంలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ దాదాపు (AQI) 500కు చేరువకావడం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది.

Delhi air pollution today

దేశ రాజధాని ఢిల్లీ(delhi)లో గాలి నాణ్యత రోజురోజుకు దిగజారుతుంది. మానవ శరీరానికి 0-50 మధ్య ఉండాల్సిన AQI రాజధానిలో మాత్రం ఏకంగా 500 స్థాయికి దగ్గరవుతుంది. తాజాగా సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (CPCB) ప్రకారం నేడు ఆనంద్ విహార్‌లో AQI 473, అలీపూర్‌లో 424, ఆయా నగర్‌లో 424, అశోక్ విహార్‌లో 471, IGI ఎయిర్‌పోర్ట్‌లో 436గా ఉంది. దీంతోపాటు చాందినీ చౌక్‌లో 405, ద్వారకా సెక్టార్‌లో 457, జహంగీర్‌పురి జేఎన్‌ఎస్‌లో 470, జెఎన్‌ఎస్‌లో 412, నరేలాలో 440, నెహ్రూ నగర్‌లో 462గా నమోదైంది.


అనేక ప్రాంతాల్లో

దీన్ని బట్టి ఢిల్లీలో గాలి నాణ్యత ఎంత ప్రాణాంతక స్థాయికి చేరుకుందో అర్థం చేసుకోవచ్చు. ఈ క్రమంలో గురువారం ఉదయం ఆయా ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు కమ్ముకుంది. గాలి నాణ్యత (AQI) మళ్లీ 'తీవ్ర' స్థాయికి చేరుకోవడంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. శ్వాసకోశ రోగులకు ఢిల్లీ గాలి మరింత ఇబ్బందిగా మారింది. ఢిల్లీలోని అనేక ప్రాంతాల్లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) 400 దాటడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.


వరుసగా 14 రోజులు

గురువారం ఉదయం పట్‌పర్‌గంజ్‌లో 472, ఓఖ్లా ఫేజ్ 2లో 441, పంజాబీ బాగ్‌లో 459, ఆర్‌కే పురంలో 457, పూసాలో 408, రోహిణిలో 453, షాదీపూర్‌లో 430, వజీర్‌పూర్‌లో 467, సోనియా విహార్‌లో 448, సోనియా విహార్‌లో 448గా ఉంది. CPCB ప్రకారం తీవ్రమైన గాలి నాణ్యత సూచిక (AQI) 401-500 ఆరోగ్యకరమైన వ్యక్తులలో కూడా శ్వాసకోశ సమస్యలను కలిగిస్తుందని హెచ్చరించారు. ఢిల్లీ గాలిలో ప్రధాన కాలుష్య కారకాలు PM 2.5 నుంచి PM 10 స్థాయిల వరకు చాలా ఎక్కువగా ఉన్నాయి. మంగళవారం సాయంత్రం వరకు వరుసగా 14 రోజుల పాటు గాలి నాణ్యత 'చాలా పేలవమైన' కేటగిరీలో ఉంది.


ప్రధాన కారణం

ఢిల్లీ కాలుష్యానికి ప్రధాన కారణం వాహనాల నుంచి వెలువడే పొగ అని చెబుతున్నారు. ఇది ఢిల్లీలో దాదాపు 13.3%గా ఉంది. మరోవైపు పొరుగు రాష్ట్రాలలో పంట తర్వాత వరి కుప్పలు తగులబెట్టడం వంటి వాటి వాళ్ల కూడా పరిస్థితి మరింత దిగజారింది. దీని ఫలితంగా నగరంలో దట్టమైన పొగమంచు కమ్ముకుంది. ఈరోజు కూడా ఢిల్లీలో పొగమంచు కురిసే అవకాశం ఉంది. దీంతోపాటు గాలి వేగం తక్కువగా ఉండడం వల్ల కాలుష్య స్థాయి తగ్గడం లేదని అంటున్నారు. వాతావరణ శాఖ ప్రకారం హిమాలయ ప్రాంతంలో క్రియాశీల పశ్చిమ డిస్ట్రబెన్స్ కూడా ఈ పరిస్థితికి కారణమైందని నిపుణులు చెబుతున్నారు. దీంతో గాలి దిశ పశ్చిమం నుంచి తూర్పుగా మారిందన్నారు.


ఇవి కూడా చదవండి:

Viral News: పోలీసులపై రాళ్ల దాడి, ఓ వాహనం దగ్ధం.. 100 మందికి పైగా అరెస్టు


Childrens Day 2024: బాలల దినోత్సవం సందర్భంగా మీ పిల్లల స్క్రీన్ టైం ఇలా తగ్గించండి.. ఇవి కూడా నేర్పించండి..


Childrens Day 2024: చిల్డ్రన్స్ డే స్పెషల్.. మీ పిల్లలను ఇలా సర్ ప్రైజ్ చేయండి..


Vegetable Prices: షాకింగ్.. త్వరలో పెరగనున్న కూరగాయల ధరలు, కారణమిదేనా...

Credit Card New Rules: క్రెడిట్ కార్డ్ యూజర్లకు అలర్ట్.. నవంబర్ 15 నుంచి కొత్త రూల్స్..

Read More National News and Latest Telugu News

Updated Date - Nov 14 , 2024 | 10:34 AM