Delhi: ఆమ్ ఆద్మీ పార్టీకి ఎదురుదెబ్బ, ఐదుగురు కౌన్సిలర్లు బీజేపీలో చేరిక
ABN, Publish Date - Aug 25 , 2024 | 05:50 PM
వచ్చే ఏడాది ప్రారంభంలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సిన నేపథ్యంలో అధికార ఆమ్ ఆద్మీ పార్టీకి గట్టి దెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన ఐదుగురు కౌన్సిలర్లు భారతీయ జనతా పార్టీలో ఆదివారంనాడు చేరారు. వారికి బీజేపీ ఢిల్లీ యూనిట్ పార్టీ కండువా కప్పి స్వాగతించింది.
న్యూఢిల్లీ: వచ్చే ఏడాది ప్రారంభంలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సిన నేపథ్యంలో అధికార ఆమ్ ఆద్మీ పార్టీ (AAP)కి గట్టి దెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన ఐదుగురు కౌన్సిలర్లు భారతీయ జనతా పార్టీ (BJP)లో ఆదివారంనాడు చేరారు. వారికి బీజేపీ ఢిల్లీ యూనిట్ పార్టీ కండువా కప్పి స్వాగతించింది. బీజేపీ తీర్ధం తీసుకున్న 'ఆప్' కౌన్సిలర్లలో రామ్ చంద్ర, పవన్ షెహ్రావత్, మంజు నిర్మల్, సుగంధ బిదూరి, మమతా పవన్ ఉన్నారు.
బీజేపీలోకి చేరాలని ఆప్ నేతలు తీసుకున్న నిర్ణయాన్ని ఆ పార్టీ ఢిల్లీ విభాగం అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవ్ స్వాగతించారు. ఆప్ అవినీతి, ప్రజాసేవకు వీలు లేకపోవడం వంటి కారణాలతోనే ఐదుగురు కౌన్సిలర్లు బీజేపీలో చేరినట్టు చెప్పారు. అభివృద్ధి దిశగా అందర్నీ ప్రధాని మోదీ కలుపుకొని వెళ్తున్న కారణంగానే తాము బీజేపీలో చేరాలనుకుంటున్నట్టు వారు చెప్పారని తెలిపారు. ఢిల్లీ ప్రజలకు సేవ చేయాలనుకునే వారందరినీ తమ పార్టీ స్వాగతిస్తుందని అన్నారు.
Chirag Paswan: ఎల్‌జేపీ (రామ్ విలాస్) అధ్యక్షుడిగా చిరాగ్ పాశ్వాన్ తిరిగి ఎన్నిక
కాగా, గత జూలైలో సైతం పలువురు ఆప్ నేతలు బీజేపీలో చేరారు. వీరిలో ఎమ్మెల్యేలు, కౌన్సిలర్లు సైతం ఉన్నారు. వీరిలో ఛాతర్‌పూర్ ఆప్ ఎమ్మెల్యే కర్తార్ సింగ్ తన్వర్, ఢిల్లీ మాజీ మంత్రి, పటేల్ నగర్ ఆప్ మాజీ ఎమ్మెల్యే రాజ్ కుమార్ ఆనంద్, ఆనంద్ భార్య వీణా ఆనంద్, ఆప్ కౌన్సిలర్ ఉమెద్ సింగ్ ఫోగత్, ఆప్ సభ్యులు రత్నేష్ గుప్తా, సచిన్ రాయ్ ఉన్నారు.
Read More National News and Latest Telugu News
Updated Date - Aug 25 , 2024 | 05:50 PM