ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Virendra Sachdeva: యమునా నదిలో స్నానం చేసి ఆసుపత్రి పాలైన బీజేపీ చీఫ్

ABN, Publish Date - Oct 26 , 2024 | 03:36 PM

యమునా నదీ జలాల క్లీనింగ్‌ విషయంలో కేజ్రీవాల్ ప్రభుత్వం మోసం చేసిందని, అవినీతికి పాల్పడిందని వీరేంద్ర సచ్‌దేవ గత గురువారం ఆరోపించారు. ఇందుకు నిరసనగా ఐటీఓ సమీపంలోని గంగా ఘాటా‌ వద్ద స్నానం చేశారు. యమునా నది పరిస్థితిపై పర్యవేక్షణ జరపాలని ముఖ్యమంత్రి అతిషి, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌కు ఆయన సవాలు విసిరారు.

న్యూఢిల్లీ: యమునా నది (Yamuna river) జలాలు దుర్గంధంగా మారాయని, జలాల ప్రక్షాళనలో కేజ్రీవాల్ సర్కార్ అవినీతికి పాల్పడిందని ఆరోపిస్తూ రెండ్రోజుల క్రితం ఆ నదిలో స్నానం చేసిన బీజేపీ చీఫ్ వీరేంద్ సచ్‌దేవా (Virendra Sachdeva) శనివారంనాడు ఆసుపత్రి పాలయ్యారు. చర్మంపై పొక్కులు రావడంతో ఆయన ఆసుపత్రిలో చేరినట్టు పార్టీ సోషల్ మీడియా పోస్ట్‌లో బీజేపీ తెలిపింది.

Kulgam: ఆర్మీ వాహనం బోల్తాపడి సైనికుడి మృతి, మరో తొమ్మిది మందికి గాయాలు


యమునా నదీ జలాల్లో స్నానం చేసిన తర్వాత వీరేంద్ర సచ్‌దేవకు స్వల్పంగా శ్వాస సంబంధిత సమస్యలు తలెత్తాయని, చర్మంపై పొక్కులు వచ్చాయని ఢిల్లీ బీజేపీ ఒక ప్రకటనలో తెలిపింది. ఆర్ఎంఎల్ ఆసుపత్రిలో ఆయన చేరారని, వైద్య పరీక్షల అనంతరం మూడు రోజుల పాటు మందులు తీసుకోవాలని వైద్యులు సూచించారని పేర్కొంది. 2025 కల్లా యమూనా జలాలను ప్రక్షాళన చేస్తామని ఇచ్చిన వాగ్గానాన్ని కేజ్రీవాల్ ప్రభుత్వం నిలుపుకోలేదని, ఆ పర్యవసానాలు ఇప్పుడు చవిచూస్తున్నామని ఆరోపించింది.


యమునా నదీ జలాల క్లీనింగ్‌ విషయంలో కేజ్రీవాల్ ప్రభుత్వం మోసం చేసిందని, అవినీతికి పాల్పడిందని వీరేంద్ర సచ్‌దేవ గత గురువారం ఆరోపించారు. ఇందుకు నిరసనగా ఐటీఓ సమీపంలోని గంగా ఘాటా‌ వద్ద స్నానం చేశారు. యమునా నది పరిస్థితిపై పర్యవేక్షణ జరపాలని ముఖ్యమంత్రి అతిషి, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌కు ఆయన సవాలు విసిరారు. 2025 ఫిబ్రవరిలో తాము అధికారంలోకి రాగానే యమునా క్లీనింగ్ అథారిటీని ఏర్పాటు చేస్తామని చెప్పారు. కాగా, ఢిల్లీలో వాయి కాలుష్యంపై బీజేపీ చేస్తున్న డ్రామాలను అంతా గమనిస్తున్నారని ఆప్ నేత, పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్ కౌంటర్ ఇచ్చారు.


ఇవి కూడా చదవండి...

Rahul Gandhi: రాహుల్‌కు గడ్డం గీస్తూ.. బార్బర్ ఎలా వణికాడో చూడండి..

Read More National News and Latest Telugu News

Updated Date - Oct 26 , 2024 | 03:36 PM