ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Arvind Kejriwal: అర్వింద్ కేజ్రీవాల్‌కు భారీ ఊరట.. బెయిల్ మంజూరు

ABN, Publish Date - Jun 20 , 2024 | 08:11 PM

ఢిల్లీ హైకోర్టులో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు భారీ ఊరట లభించింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఆయనకు న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది.

Delhi Chief Minister Arvind Kejriwal Gets Bail

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు (Arvind Kejriwal) భారీ ఊరట లభించింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌కు (Delhi Liquor Scam) సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఆయనకు రౌస్ అవెన్యూ కోర్టు (Rouse Avenue Court) రూ.1 లక్ష పూచీకత్తుతో బెయిల్ మంజూరు చేసింది. దీంతో.. ఆమ్ ఆద్మీ పార్టీ (Aam Admi Party) క్యాంప్‌లో సంబరాలు మిన్నంటాయి. ట్రయల్ కోర్టు వెకేషన్ బెంచ్ జడ్జ్ నియామ్ బిందు ఈ బెయిల్‌ని మంజూరు చేశారు. దీంతో ఆయన తీహార్ జైలు నుంచి రేపు విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.

కాగా.. ఈ కేసులో కేజ్రీవాల్ మార్చి 21వ తేదీన అరెస్ట్ అయ్యారు. అప్పటి నుంచి బెయిల్ కోసం పలుసార్లు కోర్టుకెక్కారు కానీ.. ప్రతిసారి నిరాశే ఎదురైంది. మధ్యలో ఎన్నికల ప్రచారం కోసం కొన్ని రోజుల పాటు ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరైంది. అనంతరం ఆరోగ్య సమస్యల దృష్ట్యా తన బెయిల్‌ని కొనసాగించాలని కోరారు కానీ.. అది కుదరలేదు. ఇప్పుడు ఇన్ని రోజుల తర్వాత శుక్రవారం బెయిల్ దొరకడంతో.. ఆప్ నేతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరో విషయం ఏమిటంటే.. లిక్కర్ కేసులో కోర్టు నుంచి బెయిల్ పొందిన తొలి వ్యక్తిగా కేజ్రీవాల్ నిలిచారు.

Updated Date - Jun 20 , 2024 | 09:18 PM

Advertising
Advertising