Share News

Delhi CM: లిక్కర్ కేసు డబ్బులు ఎక్కడున్నాయో.. రేపు కోర్టులోనే వెల్లడిస్తారు.. కేజ్రీవాల్ భార్య సంచలన వ్యాఖ్యలు

ABN , Publish Date - Mar 27 , 2024 | 12:49 PM

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి సీఎం అరవింద్ కేజ్రీవాల్ భార్య సునీతా కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను నిన్న ఈడీ కస్టడీలో ఉన్న తన భర్త కేజ్రీవాల్‌ను కలిశానని చెప్పారు. లిక్కర్ కేసు డబ్బు ఎక్కడ ఉందో రేపు కేజ్రీవాల్ కోర్టులో దేశ ప్రజలకు చెబుతారన్నారు. దాని ఆధారాలు బయటపెడతారని ఆమె తెలిపారు.

Delhi CM: లిక్కర్ కేసు డబ్బులు ఎక్కడున్నాయో.. రేపు కోర్టులోనే వెల్లడిస్తారు.. కేజ్రీవాల్ భార్య సంచలన వ్యాఖ్యలు

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి సీఎం అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) భార్య సునీతా కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను నిన్న ఈడీ కస్టడీలో ఉన్న తన భర్త కేజ్రీవాల్‌ను కలిశానని చెప్పారు. లిక్కర్ కేసు డబ్బు ఎక్కడ ఉందో రేపు కేజ్రీవాల్ కోర్టులో దేశ ప్రజలకు చెబుతారన్నారు. దాని ఆధారాలు బయటపెడతారని ఆమె తెలిపారు.

కేజ్రీవాల్‌కు డయాబెటిస్ ఉందని, షుగర్ లెవల్స్ సరిగ్గా లేవన్నారు. గడిచిన రెండేళ్లలో ఈడీ 250 పైగా ప్రాంతాల్లో సోదాలు చేసిందని ఒక్క పైసా దొరలేకదన్నారు. మనీష్ సిసోడియా, సంజయ్ సింగ్, సత్యేందర్ జైన్ నివాసంలో ఎలాంటి డబ్బులు దొరకలేదని సునీతా కేజ్రీవాల్ తెలిపారు. అరవింద్ కేజ్రీవాల్ నిజమైన దేశభక్తుడన్నారు. తన శరీరం జైల్లో ఉన్నా.. ఆత్మ ప్రజల్లోనే ఉందని వెల్లడించారు.

Kejriwal Arrest: కేజ్రీవాల్ అరెస్ట్‌పై అమెరికా రియాక్షన్.. ఏం చెప్పిందో తెలుసా?

రేపు కోర్టు ముందుకు..

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను ఈడీ అధికారులు ఈనెల 21వ తేదీన అరెస్ట్ చేశారు. 22న ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపర్చగా.. ఆయనకు న్యాయస్థానం 6 రోజుల ఈడీ కస్టడీకి విధించింది. ఈరోజుతో ఈడీ కస్టడీ ముగుస్తుంది. రేపు కేజ్రీవాల్‌ను కోర్టు ముందు ప్రవేశపెట్టనున్నారు. మరోవైపు అరవింద్ కేజ్రీవాల్‌ను మరో ఐదు రోజులు ఈడీ అధికారులు కస్టడీకి అడిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

PM MODI: ప్రధాని మోదీ ఇంటి ముట్టడికి ఆప్ పిలుపు.. వాళ్లకు పోలీసుల వార్నింగ్..

మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..

Updated Date - Mar 27 , 2024 | 12:50 PM