Delhi: సివిల్స్ కోచింగ్ సెంటర్‌లో విద్యార్థుల మృతిపై ఆప్‌ను టార్గెట్ చేసిన బీజేపీ..
ABN, Publish Date - Jul 28 , 2024 | 08:49 AM
దేశ రాజధాని ఢిల్లీలోని ఓల్డ్ రాజేంద్ర నగర్‌లోని సివిల్స్ కోచింగ్ సెంటర్ నిర్వహిస్తున్న భవనంలోకి వరద నీరేు చేరడంతో ముగ్గురు విద్యార్థులు మృతి చెందడం తీవ్ర కలకలం రేపుతోంది.
దేశ రాజధాని ఢిల్లీలోని ఓల్డ్ రాజేంద్ర నగర్‌లోని సివిల్స్ కోచింగ్ సెంటర్ నిర్వహిస్తున్న భవనంలోకి వరద నీరేు చేరడంతో ముగ్గురు విద్యార్థులు మృతి చెందడం తీవ్ర కలకలం రేపుతోంది. ఈ ఘటనకు ఆప్ ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. ప్రభుత్వ నిర్లక్ష్యం, అసమర్థత కారణంగా ముగ్గురు విద్యార్థులు మృతి చెందారని బీజేపీ నాయకులు ఆరోపించారు. ఈక్రమంలో అసలు ఢిల్లీలో కోచింగ్ సెంటర్ భవనంలోకి వరద నీరు చేరి విద్యార్థులు మృతి చెందిన ఘటన పూర్తి వివరాలు తెలుసుకుందాం. రావ్ ఐఏఎస్ స్టడీ సెంటర్ వద్దకు భారీగా వరద నీరు చేరిందని ఢిల్లీ అగ్నిమాపక విభాగానికి కాల్ రావడంతో ఎన్డీఆర్‌ఎఫ్, స్థానిక పోలీసులు అగ్నిమాపక శాఖ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మొదట ఒక విద్యార్థి మృతదేహాన్ని వెలికి తీశారు. కొన్ని గంటల తర్వాత మరో ఇద్దరు విద్యార్థుల మృతదేహాలు లభించాయి. కోచింగ్ సెంటర్‌లోకి వరద నీరు చేరే సమయానికి దాదాపు 30 మంది విద్యార్థులు లోపల ఉన్నారని పోలీసులు తెలిపారు . వారిలో 13 నుండి 14 మందిని రక్షించి ఆసుపత్రికి తరలించగా, మరికొందరు సంఘటనా స్థలం నుండి తప్పించుకున్నారు. వరదల గురించి సమాచారం అందుకున్న ఐదు అగ్నిమాపక వాహనాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. బేస్‌మెంట్‌లో ఏడు అడుగుల మేర నీరు నిండినట్లు అధికారులు తెలిపారు.
Rahul Gandhi: చెప్పులు కుట్టే వ్యక్తికి రాహుల్ ఊహించని సాయం..
విద్యార్థుల నిరసన..
ముగ్గురు విద్యార్థుల మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్న తర్వాత సంఘటన స్థలంలో మునిసిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ (ఎంసిడి)కి వ్యతిరేకంగా విద్యార్థుల నిరసనకు దిగారు. వర్షం కురిసిన 10 నిమిషాలకే కేంద్రంలో నీరు చేరుతుందని, 80 శాతం లైబ్రరీలు కోచింగ్ సెంటర్లు బేస్‌మెంట్‌లోనే ఉన్నాయన్నారు. ఎన్ని ఫిర్యాదులు చేసినా ఎంసిడి దీనిపై చర్యలు తీసుకోవడం లేదన్నారు. విద్యార్థులు నిరసన చేపట్టవద్దని, సహాయక చర్యలకు ఆటంకం కలుగుతుందని పోలీసులు విద్యార్థులను కోరారు.
Delhi : హరియాణా ఎన్నికల్లో కాంగ్రెస్‌కే మొగ్గు
విద్యార్థుల బాధను తాము అర్థం చేసుకోగలుగుతామని.. కానీ విద్యార్థులు నిరసన తెలియచేయడం సమస్యకు పరిష్కారం కాదని.. సహాయక చర్యలకు ఆటంకం కలిగుతుందని సెంట్రల్ జోన్ డీసీపీ హర్షవర్థన్ కోరారు. ఈ ఘటనపై ఇప్పటికే ఢిల్లీ పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేసి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ముగ్గురు విద్యార్థులు మృతి చెందిన ఘటనలో వాస్తవాలు వెలికితీయాలని పోలీసులను విద్యార్థులు కోరారు. దీనిపై డీసీపీ స్పందిస్తూ.. పారదర్శకంగా విచారణ చేస్తామని.. బాధ్యులపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు.
Delhi : ఢిల్లీలో సివిల్స్ కోచింగ్ సెంటర్‌లోకి వరద
దర్యాప్తు వేగవంతం..
ఢిల్లీలో కోచింగ్ సెంటర్‌లో వరద నీరు చేరిన ఘటనపై పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. బేస్‌మెంట్‌లో కోచింగ్ సెంటర్ నిర్వహించకూడదని నిబంధనలు ఉన్నా.. రూల్స్ పాటించకుండా ఘటనకు కారణమైన వారిని కఠినంగా శిక్షిస్తామని పోలీసులు తెలిపారు. ఇప్పటికే ఫోరెన్సిక్ బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. ఆధారాలు సేకరించే ప్రక్రియ కొనసాగుతోంది.
Delhi : ఎమర్జెన్సీలో మినహా భేషుగ్గా పార్లమెంటు పనితీరు
ఆప్‌పై మండిపడ్డ బీజేపీ
మునిసిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీలో అవినీతిపై విచారణ చేయాల్సిందేనని ఢిల్లీ బీజేపీ అధ్యక్షులు వీరేంద్ర సచ్‌దేవా డిమాండ్ చేశారు. అరవింద్ కేజ్రీవాల్, అతిషితో పాటు అవినీతికి పాల్పడుతున్న వారిపై విచారణ జరిపించాలన్నారు. మరో బీజేపీ నేత షెహజాద్ పూనావాలా మాట్లాడుతూ.. ఈ ఘటనకు ఆప్ ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాలన్నారు. ముగ్గురు విద్యార్థుల మృతిని ఆప్ ప్రభుత్వ హత్యగా ఆయన పేర్కొన్నారు. ఈ ఘటనకు ఆప్ ప్రభుత్వంలో ఎవరు బాధ్యత తీసుకుంటారని పూనావాలా ప్రశ్నించారు. ఢిల్లీ ప్రజల ప్రాణాలకు విలువ లేదా అని అడిగారు. మద్యం కుంభకోణం నుంచి కేజ్రీవాల్‌ను రక్షించడమే ఆప్ ప్రాధాన్యతగా ఉందని.. ప్రభుత్వం ఢిల్లీ వాసుల ప్రాణలను పట్టించుకోవడం లేదని విమర్శించారు.మరోవైపు ఈ ఘటనకు బాధ్యలు విడిచిపెట్టబోమని ఢిల్లీ మంత్రి అతిషి తెలిపారు. ఈ ఘటనపై పూర్తిస్థాయి దర్యాప్తునకు ఆదేశించామన్నారు.
Chennai : తమిళనాట బడ్జెట్ సెగలు.. డీఎంకే ధర్నా
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Read More National News and Latest Telugu News
Updated Date - Jul 28 , 2024 | 08:49 AM