ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Delhi Court: : పూజా ఖేద్కర్‌కు మరో షాక్‌

ABN, Publish Date - Aug 02 , 2024 | 05:23 AM

మహారాష్ట్రకు చెందిన వివాదాస్పద మాజీ ట్రైనీ ఐఏఎస్‌ పూజా ఖేద్కర్‌ మరింత చిక్కుల్లో పడ్డారు. నకిలీ ధ్రువీకరణ పత్రాలతో మోసం చేసి, అర్హత లేకున్నా ఓబీసీ, పీడబ్ల్యూడీ కోటాలో సివిల్స్‌ పరీక్షలో ప్రయోజనం పొందారనే కేసులో గురువారం ఢిల్లీ కోర్టు ఆమెకు ముందస్తు బెయిల్‌ నిరాకరించింది.

  • ముందస్తు బెయిల్‌ నిరాకరణ.. పిటిషన్‌ తోసిపుచ్చిన ఢిల్లీ కోర్టు

న్యూఢిల్లీ, ఆగస్టు 1: మహారాష్ట్రకు చెందిన వివాదాస్పద మాజీ ట్రైనీ ఐఏఎస్‌ పూజా ఖేద్కర్‌ మరింత చిక్కుల్లో పడ్డారు. నకిలీ ధ్రువీకరణ పత్రాలతో మోసం చేసి, అర్హత లేకున్నా ఓబీసీ, పీడబ్ల్యూడీ కోటాలో సివిల్స్‌ పరీక్షలో ప్రయోజనం పొందారనే కేసులో గురువారం ఢిల్లీ కోర్టు ఆమెకు ముందస్తు బెయిల్‌ నిరాకరించింది.

యూపీఎస్సీ సివిల్‌ సర్వీసెస్‌ పరీక్ష-2022 దరఖాస్తులో వాస్తవాలను వక్రీకరించి, తప్పుడు సమాచారం నింపారనే అభియోగాలతో ఢిల్లీ పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో తనను అరెస్ట్‌ చేస్తారనే భయంతో పూజ దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను పటియాల హౌస్‌ కోర్టు తోసిపుచ్చింది. యూపీఎస్సీకు చెందినవారు ఎవరైనా పూజకు సహాయం చేశారా అనే కోణంలో విచారణ చేయాలని ఢిల్లీ పోలీసులను కోర్టు ఆదేశించింది.

Updated Date - Aug 02 , 2024 | 05:23 AM

Advertising
Advertising
<