ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Delhi Liquor Scam: కేజ్రీవాల్‌ జ్యుడిషియల్ కస్టడీ మే 7 వరకూ పొడిగింపు

ABN, Publish Date - Apr 23 , 2024 | 03:24 PM

ఢిల్లీ ఎక్సైజ్ పాలసీకి చెందిన మనీలాండరింగ్ కేసులో తీహార్ జైలులో ఉన్న ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ జ్యుడిషియల్ కస్టడీని మే 7వ తేదీ వరకూ రౌస్ అవెన్యూ కోర్టు మంగళవారంనాడు పొడిగించింది.

న్యూఢిల్లీ: ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ (Delhi excise policy)కి చెందిన మనీలాండరింగ్ కేసులో తీహార్ జైలులో ఉన్న ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) జ్యుడిషియల్ కస్టడీని మే 7వ తేదీ వరకూ రౌస్ అవెన్యూ కోర్టు మంగళవారంనాడు పొడిగించింది. ఆయనతో పాటు ఈ కేసులో నిందితులుగా ఉన్న బీఆర్ఎస్ నేత కె.కవిత, ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున గోవా ఎన్నికల్లో ఫండ్ మేనేజర్‌గా వ్యవహరించిన చంద్రప్రీత్ సింగ్‌ జ్యుడిషయల్ కస్టడీని కూడా మే 7 వరకూ కోర్టు పొడిగించింది. మంగళవారంతో ఈ ముగ్గురి కస్టడీ ముగియడంతో వీరిని వర్చువల్ కాన్ఫరెన్స్‌ ద్వారా కోర్టు ముందు హాజరుపరిచారు. మరో 14 రోజులు కస్టడీకి ఇవ్వాలని దర్యాప్తు సంస్థలు కోరడంతో కోర్టు అనుమతించింది.

Lok Sabha Elections 2024: రాహుల్ గాంధీపై షాకింగ్ కామెంట్స్ చేసిన కేంద్ర మంత్రి..


కేజ్రీవాల్‌లో తక్కువ మోతాదులో ఇన్సులెన్

కాగా, జైలులో కేజ్రీవాల్ షుగర్ లెవెల్స్ పెరగడంతో ఆయనకు సోమవారం సాయంత్రం స్వల్ప మోతాదులో ఇన్సులెన్ ఇచ్చారు. దీనికి ముందు తన భార్య సునితా కేజ్రీవాల్ సమక్షంలో ప్రతిరోజూ 15 నిమిషాల పాటు మెడికల్ కన్సల్టేషన్‌కు అనుమతించాలంటూ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. అయితే, ప్రత్యేక కన్సల్టేషన్ అవసరమైతే ఎయిమ్స్ డైరెక్టర్‌ ఆధ్వర్యంలో మెడికల్ బోర్డును ఏర్పాటు చేసి వైద్య చికిత్స కల్పించాలని తీహార్ జైలు అధికారులను ఢిల్లీ కోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ ఒంట్లో చక్కెర స్థాయి పెరగడంతో ఆయనకు స్వల్ప మోతాదులో వైద్యులు ఇన్సులెన్ ఇచ్చారు. దీనిపై ఆమ్ ఆద్మీ పార్టీ హర్షం వ్యక్తం చేసింది. హనుమాన్ జయంతి సందర్భంగా తమకు ఈ వార్త ఎంతో ఆనందం కలిగించదని, ఇదంతా భగవంతుని ఈశీస్సుల ఫలితమేనని ప్రకటించింది. ఎయిమ్స్ వైద్యుల సూచన మేరకు కేజ్రీవాల్‌కు లో-డోస్ ఇన్సులెన్ రెండు యూనిట్లు ఇచ్చినట్టు తీహార్ జైలు అధికారులు వెల్లడించారు.

Read Latest National News and Telugu News

Updated Date - Apr 23 , 2024 | 03:24 PM

Advertising
Advertising