ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

AIADMK two-leaves symbol: సుఖేష్ చంద్రశేఖర్‌కు బెయిల్... ట్విస్ట్ ఏమిటంటే..?

ABN, Publish Date - Aug 30 , 2024 | 09:22 PM

పలు ఆర్థిక నేరాలపై తీహార్ జైలులో శిక్ష అనుభవిస్తున్న సుఖేష్ చంద్రశేఖర్‌ కు ఢిల్లీ కోర్టు శుక్రవారంనాడు ఒక కేసులో బెయిల్ మంజూరు చేసింది. అన్నాడీఎంకే 'రెండాకుల' ఎన్నికల గుర్తుకు సంబంధించిన ముడుపుల కేసులో ఆయనకు కోర్టు బెయిలు ఇచ్చింది.

న్యూఢిల్లీ: పలు ఆర్థిక నేరాలపై తీహార్ జైలులో శిక్ష అనుభవిస్తున్న సుఖేష్ చంద్రశేఖర్‌ (Sukesh Chandrasekhar)కు ఢిల్లీ కోర్టు శుక్రవారంనాడు ఒక కేసులో బెయిల్ మంజూరు చేసింది. అన్నాడీఎంకే 'రెండాకుల' ఎన్నికల గుర్తు (AIADMK two-leaves symbol)కు సంబంధించిన ముడుపుల కేసులో ఆయనకు కోర్టు బెయిలు ఇచ్చింది. రూ.5 లక్షల వ్యక్తిగత పూచీకత్తుతో ప్రత్యేక న్యాయమూర్తి విశాల్ గాగ్నే ఈ బెయిల్ మంజూరు చేశారు. అయితే ఈ కేసులో సుఖేష్‌కు బెయిలు మంజూరైనప్పటికీ ఇతర కేసులు పెండింగ్‌లో ఉన్నందున అతను జైలులోనే ఉండాల్సి ఉంటుంది.

Siddarmaiah: మా ఎమ్మెల్యేలకు బీజేపీ రూ.100 కోట్ల ఆఫర్.. సీఎం సంచలన అభియోగం


అన్నాడీఎంకే నేత టీటీవీ దినకరన్‌కు మధ్యవర్తిగా చంద్రశేఖర్ వ్యవహరించారని, వీకే శశికళ సారథ్యంలోని చీలక వర్గానికి పార్టీ రెండాకుల గుర్తు కేటాయించేందుకు ఎన్నికల కమిషన్‌ అధికారికి లంచం ఇచ్చే ప్రయత్నం చేశారనే ఆరోపణలను చంద్రశేఖర్ ఎదుర్కొంటున్నారు. కాగా, కేసులో నిందితుడైన వ్యక్తిని ప్రొసీడింగ్స్ పూర్తి కాకుండా ఎక్కువ కాలం జైలులో ఉంచడం సెక్షన్ 479 కింద వ్యక్తిగత స్వేచ్ఛను హరించడమేనని ప్రత్యేక న్యాయమూర్తి గాగ్నే పేర్కొంటూ చంద్రశేఖర్‌కు ఈ కేసులో బెయిల్ మంజూరు చేశారు.

Read More National News and Latest Telugu News

Updated Date - Aug 30 , 2024 | 09:23 PM

Advertising
Advertising