Delhi : రాష్ర్టీయ విజ్ఞాన్ పురస్కారాల ప్రదానం
ABN, Publish Date - Aug 23 , 2024 | 04:56 AM
మొట్టమొదటి రాష్ట్రీయ విజ్ఞాన్ పురస్కారాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రదానం చేశారు. గురువారం రాష్ట్రపతిభవన్‌లోని గణతంత్ర మండపంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్(బెంగళూరు) మాజీ డైరెక్టర్, బయోకెమిస్ట్ గోవింద్‌రాజన్ పద్మనాభన్‌ను దేశ అత్యున్నత సైన్స్ అవార్డుతో సత్కరించారు.
న్యూఢిల్లీ, ఆగస్టు 22: మొట్టమొదటి రాష్ట్రీయ విజ్ఞాన్ పురస్కారాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రదానం చేశారు. గురువారం రాష్ట్రపతిభవన్‌లోని గణతంత్ర మండపంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్(బెంగళూరు) మాజీ డైరెక్టర్, బయోకెమిస్ట్ గోవింద్‌రాజన్ పద్మనాభన్‌ను దేశ అత్యున్నత సైన్స్ అవార్డుతో సత్కరించారు.
అలాగే, 13 మందికి విజ్ఞాన్‌శ్రీ పురస్కారాలు, 18 మందికి విజ్ఞాన్ యువ శాంతి స్వరూప్ భట్నాగర్ బహుమతులు ప్రదానం చేశారు. దీంతోపాటు చంద్రయాన్-3 మిషన్‌లో పనిచేసిన శాస్త్రవేత్తలు, ఇంజనీర్లకు విజ్ఞాన్ టీమ్ అవార్డు అందజేశారు.
ఈ అవార్డును చంద్రయాన్-3 మిషన్ ప్రాజెక్టు డైరెక్టర్ పి.వీరముత్తువేల్ స్వీకరించారు. అవార్డు గ్రహీతలందరికీ ఒక మెడల్‌తోపాటు సంబంధిత రంగాల్లో వారు కనబరిచిన ప్రతిభను తెలియజేస్తూ ప్రశంసాపత్రాన్ని అందజేశారు.
Updated Date - Aug 23 , 2024 | 04:57 AM