Delhi : విదేశాంగ శాఖ మాజీ మంత్రి నట్వర్ సింగ్ కన్నుమూత
ABN, Publish Date - Aug 12 , 2024 | 04:18 AM
విదేశాంగ శాఖ మాజీ మంత్రి కే నట్వర్‌సింగ్(93) కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన కొన్నాళ్లుగా గురుగ్రామ్‌లోని మేదాంత ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం రాత్రి తుదిశ్వాస విడిచారు. దౌత్య, రాజకీయ రంగాలతో పాటు రచనా వ్యాసంగంలోనూ ఆయన తనదైన ముద్ర వేశారు.
న్యూఢిల్లీ, ఆగస్టు 11: విదేశాంగ శాఖ మాజీ మంత్రి కే నట్వర్‌సింగ్(93) కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన కొన్నాళ్లుగా గురుగ్రామ్‌లోని మేదాంత ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం రాత్రి తుదిశ్వాస విడిచారు. దౌత్య, రాజకీయ రంగాలతో పాటు రచనా వ్యాసంగంలోనూ ఆయన తనదైన ముద్ర వేశారు.
కాంగ్రె్‌సతో సుదీర్ఘ అనుబంధం ఉన్న ఆయన మాజీ ప్రధానులు ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీతో సన్నిహితంగా మెలిగారు. 1931లో భరత్‌పూర్ (రాజస్థాన్) రాజ కుటుంబంలో జన్మించిన నట్వర్ సింగ్.. 1953లో ఇండియన్ ఫారిన్ సర్వీసె్‌సకు ఎంపికయ్యారు. విదేశాంగ శాఖ కార్యదర్శిగా కూడా పనిచేశారు. 1984లో ప్రభుత్వం ఆయనను పద్మభూషణ్‌తో సత్కరించింది. అదే ఏడాది నట్వర్ సింగ్ ఉద్యోగానికి రాజీనామా చేసి.. కాంగ్రెస్ పార్టీలో చేరారు. భరత్‌పూర్ నుంచి పోటీ చేసి గెలిచారు.
కేంద్ర సహాయ మంత్రిగా పనిచేశారు. 2004లో కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి రావడంతో నట్వర్ సింగ్ విదేశాంగ మంత్రిగా నియమితులయ్యారు. అయితే 18 నెలలకే.. ‘ఇరాక్ ఆయిల్ కుంభకోణం’లో ఆయనతో పాటు కాంగ్రెస్ పార్టీ కూడా లబ్ధి పొందిందంటూ ఐక్యరాజ్య సమితి స్వతంత్ర కమిటీ నివేదిక ఇవ్వడంతో ఆయన వైదొలగక తప్పలేదు.
కొన్నాళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీకీ రాజీనామా చేశారు. తర్వాత బీఎస్పీలో చేరినా నాలుగు నెలలకే క్రమశిక్షణా చర్యల కింద ఆయనను బహిష్కరించారు. నట్వర్‌సింగ్ దౌత్యరంగానికి విశిష్ట సేవలందించారంటూ ప్రధాని మోదీ, ఖర్గే నివాళులర్పించారు.
Updated Date - Aug 12 , 2024 | 04:18 AM