ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Delhi Coaching Centre Deaths: ఢిల్లీ సర్కార్ 'ఉచితాల సంస్కృతి'ని తప్పుపట్టిన హైకోర్టు

ABN, Publish Date - Jul 31 , 2024 | 02:59 PM

ఢిల్లీ ఓల్డ్ రాజేంద్ర నగర్‌లోని ఐఏఎస్ కోచింగ్ సెంటర్ సెల్లార్‌లోకి వరద నీరు ముంచెత్తి ముగ్గురు విద్యార్థులు మృతి చెందిన ఘటనపై బాధ్యులను ఢిల్లీ హైకోర్టు బుధవారంనాడు చీవాట్లు పెట్టింది. ఢిల్లీ ప్రభుత్వ ''ఉచితాల సంస్కృతి''ని తప్పుపట్టింది.

న్యూఢిల్లీ: ఢిల్లీ ఓల్డ్ రాజేంద్ర నగర్‌లోని ఐఏఎస్ కోచింగ్ సెంటర్ సెల్లార్‌లోకి వరద నీరు ముంచెత్తి ముగ్గురు విద్యార్థులు మృతి చెందిన ఘటనపై బాధ్యులను ఢిల్లీ హైకోర్టు (Delhi High court)బుధవారంనాడు చీవాట్లు పెట్టింది. ఢిల్లీ ప్రభుత్వ ''ఉచితాల సంస్కృతి'' (freebie culture)ని తప్పుపట్టింది. డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (DCP), ఇన్వెస్టిగేటింగ్ అధికారిని శుక్రవారంనాడు తమ ముందు హాజరుకావాలని హైకోర్టు ఆదేశించింది. రాజేంద్ర నగర్ ప్రాంతంలోని డ్రైన్లపైనున్న అన్ని ఆక్రమణలను శుక్రవారంలోగా తొలగించాలని కూడా కోర్టు అదేశాలిచ్చింది. రాజేంద్ర నగర్ ఘటనపై ఉన్నత స్థాయి దర్యాప్తు కమిటీని ఏర్పాటు చేయాలని కోరుతూ న్యాయవాది రుద్ర విక్రమ్ సింగ్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజనాల వ్యాజ్యంపై విచారణ చేపట్టిన హైకోర్టు తాజా ఆదేశాలిచ్చింది. శుక్రవారం మధ్యాహ్నం 2.30 గంటలకు విచారణను వాయిదా వేసింది.


ఉచితాల సంస్కృతి కారణంగా మౌలిక వసతుల అప్‌గ్రేడేషన్‌కు, ముఖ్యంగా డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచేందుకు ప్రభుత్వం వద్ద నిధులు లేకుండా పోతున్నాయని, సిటీ జనాభా మరోవైపు ఇబ్బడిముబ్బడిగా పెరుగుతోందని యాక్టింగ్ చీఫ్ జస్టిస్ మన్మోహన్, జస్టిస్ తుషార్ రావు గేదెలతో కూడిన ధర్మాసనం అభిప్రాయపడింది. విచారణలో బాధ్యులను గుర్తించాల్సిన అవసరం ఉందని పేర్కొంది. ''బాధ్యులను తేల్చకుంటే ఇన్వెస్టిగేషన్‌ను సెంట్రల్ ఏజెన్సీకి మేము అప్పగించాల్సి వస్తుంది. ఇది చాలా సీరియస్ ఘటన. ఇది అతిపెద్ద ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ బ్రేక్‌డౌన్. తొలుత ఇది నిర్లక్ష్యానికి సంబంధించిన కేసు'' అని ధర్మాసనం విస్పష్టంగా పేర్కొంది. కేసుకు సంబంధించిన అన్ని ఫైల్స్‌తో డీసీపీ, ఎంసీడీ కమిషనర్ శుక్రవారం 2.30 గంటలకు కోర్టు ముందు హాజరుకావాలని ఆదేశించింది.

AAP Govt : ఢిల్లీలో కోచింగ్‌ సెంటర్ల నియంత్రణకు చట్టం..!


ఢిల్లీ ప్రభుత్వం, ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్, సంబంధిత అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ ఘటన జరిగిందని కోర్టు విమర్శిచింది. వందల ఏళ్ల నాటి మౌలిక సదుపాయాలు ఎందుకు మెరుగుపరచడం లేదని నిలదీసింది. ఆ పనే చేసి ఉంటే సెల్లార్‌లోకి నీళ్లు ఎలా వెళ్లేవని ప్రశ్నించింది. అధికారుల దివాళాకోరుతనం, బాధ్యతారాహిత్యం స్పష్టంగా కనిపిస్తోందని పేర్కొంది.

Read More National News and Latest Telugu News

Updated Date - Jul 31 , 2024 | 03:06 PM

Advertising
Advertising
<