ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Delhi : కవిత కస్టడీ మళ్లీ పొడిగింపు

ABN, Publish Date - Jul 27 , 2024 | 02:40 AM

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టయి.. తిహాడ్‌ జైలులో ఉన్న బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జ్యుడీషియల్‌ కస్టడీని న్యాయస్థానం మరోసారి పొడిగించింది. కవిత కస్టడీపై విచారణను ఈ నెల 31న చేపట్టనున్నట్లు తెలిపింది.

  • న్యాయమూర్తి సెలవు కారణంగా 31కి విచారణ వాయిదా

న్యూఢిల్లీ, జూలై 26 (ఆంధ్రజ్యోతి): ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టయి.. తిహాడ్‌ జైలులో ఉన్న బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జ్యుడీషియల్‌ కస్టడీని న్యాయస్థానం మరోసారి పొడిగించింది. కవిత కస్టడీపై విచారణను ఈ నెల 31న చేపట్టనున్నట్లు తెలిపింది. ఈ కేసులో సీబీఐ సప్లిమెంటరీ చార్జిషీట్‌ను దాఖలు చేయగా.. అందులో తప్పులు ఉన్నాయని, తనకు బెయిల్‌ ఇవ్వాలని కోరుతూ కవిత ట్రయల్‌ కోర్టులో పిటిషన్‌ వేసిన విషయం తెలిసిందే.

కాగా, సీబీఐ చార్జిషీట్‌, కవిత బెయిల్‌ పిటిషన్‌ రెండింటిపై ఈ నెల 22న విచారణ చేపట్టిన ఢిల్లీ రౌస్‌ అవెన్యూ కోర్టు.. బెయిల్‌ పిటిషన్‌పై విచారణను ఆగస్టు 5కు వాయిదా వేసింది. చార్జిషీట్‌ను పరిగణనలోకి తీసుకునే అంశంతోపాటు కవిత జ్యుడీషియల్‌ కస్టడీని ఈ నెల 26 వరకు పొడిగించింది. అయితే శుక్రవారం ట్రయల్‌ కోర్టులో ప్రత్యేక న్యాయమూర్తి కావేరి భవేజా సెలవులో ఉండడంతో విచారణ మరోసారి వాయిదా పడింది. కవిత జ్యుడీషియల్‌ కస్టడీతోపాటు చార్జిషీట్‌ను పరిగణనలోకి తీసుకునే అంశంపై ఈ నెల 31న విచారణ చేపట్టనున్నట్టు న్యాయస్థానం పేర్కొంది.

Updated Date - Jul 27 , 2024 | 02:40 AM

Advertising
Advertising
<