ఢిల్లీలో 40 స్కూళ్లకు బాంబు బెదిరింపులు
ABN, Publish Date - Dec 10 , 2024 | 02:40 AM
ఢిల్లీలోని పాఠశాలలకు బాంబు బెదిరింపులు మరోసారి కలకలం రేపాయి. నగరంలోని సుమారు 40 పాఠశాలలకు సోమవారం బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి.
న్యూఢిల్లీ, డిసెంబరు 9: ఢిల్లీలోని పాఠశాలలకు బాంబు బెదిరింపులు మరోసారి కలకలం రేపాయి. నగరంలోని సుమారు 40 పాఠశాలలకు సోమవారం బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. ఈ మెయిల్స్ పంపిన వ్యక్తి 30వేల డాలర్లు(సుమారు రూ.25 లక్షలు) డిమాండ్ చేశాడని, దీంతో ఆయా స్కూళ్లలో తనిఖీలు నిర్వహించామని పోలీసులు వెల్లడించారు. అయితే అనుమానాస్పదంగా ఏమీ కనిపించలేదని పేర్కొన్నారు. మెయిల్స్ అన్నీ ఒకే ఈ-మెయిల్ నుంచి వచ్చినట్టు పోలీసులు గుర్తించారు.
Updated Date - Dec 10 , 2024 | 02:40 AM