ఢిల్లీలో ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్
ABN, Publish Date - Nov 21 , 2024 | 04:24 AM
దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం అత్యంత ప్రమాదకర స్థాయికి చేరుకోవడంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది.
న్యూఢిల్లీ, నవంబరు 20: దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం అత్యంత ప్రమాదకర స్థాయికి చేరుకోవడంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. కాలుష్య తీవ్రతను తగ్గించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో 50 శాతం మందికి వర్క్ ఫ్రం హోమ్ ప్రకటించింది. అలాగే, ప్రభుత్వ కార్యాలయాల పని వేళల్లోనూ మార్పులు చేసింది. ఫిబ్రవరి 28 వరకు ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్ కార్యాలయాలు ఉదయం ఎనిమిదన్నర నుంచి సాయంత్రం ఐదు గంటల దాకా పని చేస్తాయని, ఢిల్లీ ప్రభుత్వ కార్యాలయాలు ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఆరున్నర దాకా పని చేస్తాయని వెల్లడించింది.
Updated Date - Nov 21 , 2024 | 04:26 AM