Delhi : చైనా సోషల్ మీడియాలో టిబెటన్ కంటెంట్‌పై నిషేధం
ABN, Publish Date - Aug 05 , 2024 | 01:48 AM
టిబెట్ భాషలోని కంటెంట్‌ని నిషేధిస్తూ చైనా సోషల్ మీడియా ప్లాట్‌ఫాం తీసుకున్న నిర్ణయంపై ప్రపంచ వ్యాప్తంగా ఉన్న టిబెట్ల నుంచి తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.
తీవ్రంగా నిరసించిన టిబెటన్ హక్కుల సంఘాలు
న్యూఢిల్లీ, ఆగస్టు 4: టిబెట్ భాషలోని కంటెంట్‌ని నిషేధిస్తూ చైనా సోషల్ మీడియా ప్లాట్‌ఫాం తీసుకున్న నిర్ణయంపై ప్రపంచ వ్యాప్తంగా ఉన్న టిబెట్ల నుంచి తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. తమ సంస్కృతి, సంప్రదాయాలు, అభిప్రాయాలను, జీవన సరళిని తెలియజేసేందుకు సోషల్ మీడియా మాతృభాషలో పెడుతున్న కంటెంట్‌పై నియంత్రణలు పెట్టడమేంటని నిలదీస్తున్నాయి.
ధర్మశాల కేంద్రంగా పనిచేసే టిబెటన్ సెంటర్ ఫర్ హ్యూమన్ రైట్స్ అండ్ డెమొక్రసీ (టీసీహెచ్‌ఆర్‌డీ) చైనా సోషల్ మీడియా ప్లాట్‌ఫాం డౌయిన్ తీరును తీవ్రంగా ఖండించింది. చైనా సోషల్ మీడియా దిగ్గజం డౌయిన్ తీసుకున్న ఈ నిర్ణయం ప్రభావం టిబెట్ నెటిజన్లు తమ మాతృ భాషలో చేసే వీడియోలపై తీవ్ర ప్రభావం చూపనుందని టీసీహెచ్‌ఆర్‌డీ డైరెక్టర్ టెన్‌జీన్ దవా తెలిపారు.
డౌయిన్ కంపెనీ తీసుకున్న నిర్ణయం అక్రమమని ఆమె స్పష్టం చేశారు. ఇలాంటి ఆంక్షలు పెట్టడం ద్వారా టిబెటన్ సంస్కృతిని, భాషని పూర్తిగా నిర్మూలించే చర్యలకు జిన్‌పింగ్ ప్రభుత్వం దిగిందని, తద్వారా టిబెటన్లతో బలవంతంగా చైనీస్ మాట్లాడించేందుకు ప్రయత్నిస్తోందని, తద్వారా టిబెట్‌లో టిబెటన్లకు చోటు లేకుండా చేయాలని చూస్తున్నారని దవా మండిపడ్డారు.
Updated Date - Aug 05 , 2024 | 01:48 AM