Delhi UPSC aspirants death: ఆప్ ప్రభుత్వమే లక్ష్యంగా ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ విమర్శలు
ABN, Publish Date - Jul 28 , 2024 | 06:44 PM
భారీ వర్షాల కారణంగా రాజేంద్రనగర్‌లో వరద నీటిలో చిక్కుకుని సివిల్స్ ఆశావహులు ముగ్గురు మృతి చెందారు. అలాగే భారీ వర్షాల నేపథ్యంలో కరెంట్ షాక్‌తో మరో విద్యార్థి మృతి చెందాడు. దేశ రాజధానిలో చోటు చేసుకున్న ఈ తరహా ఘటనలపై ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వి కె సక్సెనా ఆదివారం ఎక్స్ వేదికగా స్పంధించారు.
న్యూఢిల్లీ, జులై 28: భారీ వర్షాల కారణంగా రాజేంద్రనగర్‌లో వరద నీటిలో చిక్కుకుని సివిల్స్ ఆశావహులు ముగ్గురు మృతి చెందారు. అలాగే భారీ వర్షాల నేపథ్యంలో కరెంట్ షాక్‌తో మరో విద్యార్థి మృతి చెందాడు. దేశ రాజధానిలో చోటు చేసుకున్న ఈ తరహా ఘటనలపై ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వి కె సక్సెనా ఆదివారం ఎక్స్ వేదికగా స్పంధించారు. ఆ క్రమంలో అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ విమర్శలు గుప్పించారు.
Also Read: Uttar Pradesh: అఖిలేష్ రాజీనామా.. కొత్త ప్రతిపక్ష నేత ఎంపిక
స్పందించిన ఢిల్లీ ఎల్జీ..
నేరపూరితమైన నిర్లక్ష్యం, ప్రాథమిక నిర్వహణలో వైఫల్యానికి ఈ సంఘటనలు అద్దం పడుతున్నాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. నగరంలో మురికి నీటి డ్రైనేజీకి అందుకు సంబంధించిన మౌలిక సదుపాయాలు కల్పించడంలో సంబంధిత ఏజెన్సీలు, వ్యవస్థలు అన్నీ కుప్పకూలాయని పేర్కొన్నారు. ఢిల్లీలో ప్రస్తుతం చోటు చేసుకున్న ఘటనలు.. గత దశాబ్దంగా లేదా అంతకంటే ఎక్కువ కాలంగా ఈ నగరం ఎదుర్కొన్న దుష్పరిపాలన దుస్థితికి అద్దం పడుతుందని ఆయన వ్యాఖ్యానించారు. ఇటీవల కరెంట్ షాక్‌తో ఢిల్లీలో ఏడుగురు మరణించిన విషయాన్ని ఢిల్లీ ఎల్జీ ఈ సందర్భంగా గుర్తు చేశారు. దేశ రాజధాని ఢిల్లీలో కీలకమైన భద్రతా సమస్యలతోపాటు రాజధానిలో మెరుగైన మౌలిక సదుపాయాలు, అత్యవసర ప్రతిస్పందన కోసం తక్షణ చర్యలు చేపట్టాల్సిన అవశ్యకతను ఈ సందర్భంగా ఆయన నొక్కి చెప్పారు.
Also Read: Rahul Gandhi: సివిల్స్ ఆశావహులు మృతి.. మూల్యం చెల్లించుకుంటున్న సామాన్యుడు
డివిజనల్ కమిషనర్‌కు ఆదేశాలు..
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఆదేశాలతో ఢిల్లీ పోలీసులు, ఢిల్లీ అగ్నిమాపక శాఖ సిబ్బందితో సహాయక చర్యలు కొనసాగుతున్నాయన్నారు. అలాగే సహాయక చర్యలను తాను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. అలాగే పాత రాజేంద్రనగర్‌లో సివిల్స్ ఆశావహుల మృతిపై నివేదిక అందజేయాలని ఇప్పటికే డివిజనల్ కమిషనర్‌ను ఆదేశించామని తెలిపారు. ఈ ఘటనకు నేరపూరిత నిర్లక్ష్యంతోపాటు నిర్వహాణ లోపాలే కారణమని ఢిల్లీ ఎల్జీ కుండ బద్దలు కొట్టారు. దేశ రాజధాని న్యూఢిల్లీలో ఈ తరహా ఘటన చోటు చేసుకోవడం అత్యంత దురదృష్టకరమే కాదు.. ఇది ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదని ఎల్జీ వి.కె. సక్సెనా స్పష్టం చేశారు.
Also Read:West Bengal: మహిళ ఫిర్యాదు.. టీఎంసీ మరో నేత అరెస్ట్
భారీ వర్షాలు.. నీటిలో చిక్కుకున్న విద్యార్థులు..
న్యూఢిల్లీలో శనివారం రాత్రి కురిసిన భారీ వర్షాల కారణంగా.. వివిధ ప్రాంతాల్లో భారీగా వర్షపు నీరు నిలిచిపోయింది. ఆ క్రమంలో రాజేంద్ర నగర్‌లో ఓ సివిల్స్ కోచింగ్ సెంటర్ బేస్ మెంట్‌లోకి వరద నీరు చేరింది. దీంతో ఆ నీటిలో చిక్కుకుని ముగ్గురు సివిల్స్ ఆశావహులు మరణించారు. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సంఘటనపై కాంగ్రెస్ ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ స్పందించారు. అలాగే సివిల్స్ ఆశావహులు.. రోడ్డుపైకి వచ్చి ఆందోళనలు, ధర్నాలు నిర్వహించారు.
Also Read: Viral Video: భారత్‌లోకి అక్రమంగా ప్రవేశం.. వీడియోలో వివరించిన యూట్యూబర్ ?
Read More National News and Latest Telugu News
Updated Date - Jul 28 , 2024 | 06:44 PM