ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Delhi Water Crisis: నీళ్లివ్వండి మహాప్రభో.. సుప్రీం తలుపుతట్టిన ఢిల్లీ సర్కార్

ABN, Publish Date - May 31 , 2024 | 12:51 PM

టి యుద్ధాలు వస్తాయని పర్యావరణవేత్తలు ఎప్పటి నుంచో చెబుతున్నారు. ఆ మాటలకు అక్షర సత్యాలుగా నిలుస్తున్నాయి ప్రస్తుత పరిస్థితులు. మొన్నటి మొన్న బెంగళూరు నగరం తీవ్ర కరవులో అల్లాడిపోగా.. ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీ వంతు వచ్చింది. అక్కడ నీటి కొరత(Delhi Water Crisis) ఎంతలా ఉందంటే.. ఏకంగా సీఎం కేజ్రీవాల్(CM Arvind Kejriwal) సర్కార్ చేతులెత్తేసి శుక్రవారం సుప్రీం కోర్టును(Supreme Court) ఆశ్రయించింది.

ఢిల్లీ: నీటి యుద్ధాలు వస్తాయని పర్యావరణవేత్తలు ఎప్పటి నుంచో చెబుతున్నారు. ఆ మాటలకు అక్షర సత్యాలుగా నిలుస్తున్నాయి ప్రస్తుత పరిస్థితులు. మొన్నటి మొన్న బెంగళూరు నగరం తీవ్ర కరవులో అల్లాడిపోగా.. ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీ వంతు వచ్చింది. అక్కడ నీటి కొరత(Delhi Water Crisis) ఎంతలా ఉందంటే.. ఏకంగా సీఎం కేజ్రీవాల్(CM Arvind Kejriwal) సర్కార్ చేతులెత్తేసి శుక్రవారం సుప్రీం కోర్టును(Supreme Court) ఆశ్రయించింది. ఎందుకో తెలుసా.. హరియాణా, ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల నుంచి ఢిల్లీకి నీటిని సరఫరా చేయాలని.

అది కూడా నెల రోజులపాటు. అంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఢిల్లీలోని ముంగేష్‌పూర్‌లో బుధవారం అత్యధికంగా 52.9 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. ఇక అక్కడి నుంచి మొదలయ్యాయి నీటి కష్టాలు. రాజధాని ప్రజలు ఒక్క బకెట్ నీరు దొరికినా ఎలాగోలా సర్దుకుపోదామని అనుకుంటున్నారు.


దీంతో ప్రభుత్వానికి వినతుల మీద వినతులు ఇస్తున్నారు. ప్రభుత్వం కూడా ఏమీ చేయలేక నీరు ఇవ్వాలని అత్యుత్తమ ధర్మాసనంలో పిటిషన్ దాఖలు చేసింది. ఎండల తీవ్రతతో ఢిల్లీకి నీటి అవసరం పెరిగిందని, రాజధాని అవసరాలను తీర్చడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పిటిషన్‌లో ప్రభుత్వం పేర్కొంది. చాణక్యపురి సంజయ్ క్యాంప్ ప్రాంతం, గీతా కాలనీ సహా పలు ప్రాంతాలు తీవ్రమైన నీటి కొరతను ఎదుర్కొంటున్నాయి.

కాలనీలలోకి ట్యాంకర్లు వస్తున్నా.. ఆ నీరు ఏ మూలకూ చాలట్లేదు. కనీసం ఒక్క బకెట్ అయినా దొరుకుతుందా అనే ఆశతో గంటల తరబడి లైన్లలో వేచి చూస్తున్నారు. నీరు వృథా చేస్తున్న వారికి ప్రభుత్వం రూ.2 వేల జరిమానా విధిస్తోంది. ఈ నిబంధనను కచ్చితంగా అమలు పరచడానికి 200 బృందాలను ఏర్పాటు చేసింది. ఢిల్లీ పరిస్థితి భవిష్యత్తులోనూ ఇలాగే ఉంటే నీటి యుద్ధాలు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అసలు రాజధానికి ఏమైంది. పరిస్థితి ఎందుకింత అధ్వానంగా మారింది.


అల్లాడుతున్న ప్రజలు..

నీటి సమస్యపై ప్రభుత్వానికి దరఖాస్తులు చేసినా తమ వినతులను పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తూర్పు ఢిల్లీలోని గీతా కాలనీలో నివాసించే రుడాల్ మాట్లాడుతూ, "నీటి ఎద్దడి పెద్ద సమస్యగా మారింది. మేం ప్రభుత్వానికి రెండు దరఖాస్తులు రాశాం. కానీ పేదల మాట ఎవరు వింటారు? బతకాలంటే నీళ్లను కొనుక్కోవాల్సిందే. మునుపటి కంటే ట్యాంకర్ల ధరలు అమాంతం పెంచేశారు. మా బాధలు ఎవరు పట్టించుకుంటారు" అని ఆవేదన వ్యక్తం చేశారు.

4 వేల నుంచి 5 వేల మందికి ఒక ట్యాంకరే సరఫరా చేస్తున్నారని.. ఆ నీరు ఎవరికి సరిపోతుందని మరొకరు ప్రశ్నించారు. "ప్రభుత్వ ట్యాంకర్‌కు ఆర్డర్ ఇస్తే, అది రావడానికి 20 రోజులు పడుతుంది. ప్రైవేట్ ట్యాంకర్ కోసం రూ.1800-2000 చెల్లించాలి" అని మరొకరు వాపోయారు.


3 రాష్ట్రాలపై ఆధారం..

ఢిల్లీ జనాభా 2.4 కోట్లు. ఇక్కడ వర్షపాతం నిమిషానికి 600 మి.మీ, ఇది అవసరం కంటే చాలా తక్కువ. ఢిల్లీ నీటి అవసరాలలో 50 శాతం హర్యానా, ఉత్తరప్రదేశ్, పంజాబ్‌పై ఆధారపడి ఉంది. ఈ రాష్ట్రాలు నిరాకరిస్తే ఢిల్లీలో నీటి యుద్ధాలు రావడం పక్కా అంటున్నారు నిపుణులు.

దీనికితోడు అత్యధిక ఉష్ణోగ్రతలు నీటి వాడకాన్ని పెంచాయి. భూగర్భ జలాలు అడుగంటాయి. దేశవ్యాప్తంగా రానున్న రోజుల్లో సైతం ఢిల్లీ, రాజస్థాన్‌లోని జైపూర్, పంజాబ్‌లోని భటిండా, ముంబై, చెన్నై, బెంగళూరు నగరాలు కరవు పరిస్థితులను ఎదుర్కోనున్నాయి. ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపట్టకపోతే కరవుతో ప్రజలు అల్లాడి చనిపోయే రోజులు వస్తాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

For Latest News and National News click here

Updated Date - May 31 , 2024 | 01:51 PM

Advertising
Advertising