Delhi : ఈ ప్రజాస్వామ్యం మాకొద్దు!
ABN, Publish Date - Jul 12 , 2024 | 04:28 AM
అధిక ఆదాయ దేశాలు, ప్రత్యేకంగా పశ్చిమ దేశాల్లోని ప్రజలు తమ దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ పనితీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.
పాశ్చాత్య దేశాల ప్రజల్లో వ్యవస్థపై అసంతృప్తి
27 దేశాల్లో ప్యూ రీసెర్చ్ సెంటర్ సర్వే
న్యూఢిల్లీ, జూలై 11: అధిక ఆదాయ దేశాలు, ప్రత్యేకంగా పశ్చిమ దేశాల్లోని ప్రజలు తమ దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ పనితీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈ అంశంపై ప్యూ రీసెర్చ్ సెంటర్ 27 దేశాల్లో 900కు పైగా సర్వే నిర్వహించింది.
ఉత్తర అమెరికాలో 68% మంది ప్రజలు ప్రస్తుత ప్రజాస్వామ్యం తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. మెక్సికోలో సైతం 50ు మంది ప్రజలు ఇదే అబిప్రాయంతో ఉన్నారు. జస్టిన్ ట్రూడో నేతృత్వంలోని కెనడాలో కేవలం 52% మంది మాత్రమే ప్రజాస్వామ్యం పట్ల సానుకూలంగా ఉ న్నారు.
యూరప్ దేశాలో ఒక్క స్వీడన్‌లో మాత్రమే 75% మంది ప్రజలు ప్రజాస్వామ్యంపై సంతృప్తి ప్రకటించారు. ఇక ప్రపంచంలోని అత్యంత పురాతన ప్రజాస్వామ్య దేశాల్లో ఒకటైన ఫ్రాన్స్‌లో కేవ లం 35ు మంది మాత్రమే సానుకూలత తెలపడం విశేషం.
గ్రీస్‌లో వీరిసంఖ్య అత్యల్పంగా 22శాతంగా నమోదైంది. ఇక ఆసియా దేశాల్లో సింగపూర్, భారత్ మాత్రమే 75శాతానికి పైగా సంతృప్తిని నమోదు చేశాయి. సింగపూర్‌లో 80శాతం, భారత్‌లో 77ు మంది ప్రజాస్వామ్యం తీరుపై సంతోషం వ్యక్తం చేశారు. ఈ జాబితాలో జపాన్ 31 శాతంతో అడుగున ఉంది. సర్వే నిర్వహించిన 11 దేశాల్లోని 50ు మంది ప్రజాస్వామ్యం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. 17 పాశ్చాత్య దేశాల్లోని 11 చోట్ల మాత్రం ఈ విషయంలో ప్రజలు సంతృప్తిగా లేరు.
Updated Date - Jul 12 , 2024 | 07:03 AM