Delhi : ఢిల్లీలో జనమే జనం!
ABN, Publish Date - Jul 13 , 2024 | 04:11 AM
ప్రపంచ జనాభా శరవేగంగా పెరుగుతోంది. నగరాలు, పట్టణాల్లో ఈ పెరుగుదల మరింత వేగంగా ఉంది. ఉద్యోగావకాశాలు, వలసల కారణంగా ప్రజలు నగరాలకు తరలివచ్చి స్థిరపడుతున్నారు.
ప్రపంచంలోనే అత్యధిక జనసమ్మర్థ నగరాల్లో రెండోది
న్యూఢిల్లీ, జూలై 12: ప్రపంచ జనాభా శరవేగంగా పెరుగుతోంది. నగరాలు, పట్టణాల్లో ఈ పెరుగుదల మరింత వేగంగా ఉంది. ఉద్యోగావకాశాలు, వలసల కారణంగా ప్రజలు నగరాలకు తరలివచ్చి స్థిరపడుతున్నారు. ఐక్యరాజ్యసమితికి చెందిన వరల్డ్ అర్బనైజేషన్ ప్రాస్పెక్ట్ తాజా నివేదిక ప్రకారం..
ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన నగరాల జాబితాలో మన దేశ రాజధాని ఢిల్లీ రెండో స్థానంలో నిలిచింది. ప్రస్తుతం 3.3కోట్ల మంది ఢిల్లీలో నివాసం ఉంటున్నారు. ప్రపంచంలో టాప్-10 అత్యంత జనసమ్మర్థ నగరాల జాబితాలో భారత్ నుంచి ఢిల్లీ, ముంబై(9వ స్థానం) చోటు దక్కించుకున్నాయి.
హైదరాబాద్ 34వ స్థానంలో ఉంది. 2028 నాటికి ఢిల్లీ ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక జనాభా కలిగిన నగరంగా అవతరించనుందని నివేదిక అంచనా వేసింది. కాగా 3.7 కోట్ల మంది జనాభాతో టోక్యో ఈ జాబితాలో టాప్‌లో నిలిచింది. ఈ నివేదిక ప్రకారం.. 2062 నాటికి భారత్ జనాభా 170 కోట్లకు చేరనుంది. 2050 నాటికి ప్రతి ముగ్గురిలో ఇద్దరు నగరాలు లేదా పట్టణ కేంద్రాల్లో నివసించే అవకాశం ఉంది.
Updated Date - Jul 13 , 2024 | 04:11 AM