ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Deputy CM: నిజం ఒప్పేసుకున్నారు.. అక్కడ ఓటమికి బాధ్యత నాదే..

ABN, Publish Date - Jun 08 , 2024 | 12:49 PM

బెంగళూరు గ్రామీణ నియోజకవర్గం ఓటమికి వ్యక్తిగతంగా తనదే బాధ్యత అని ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌(Deputy Chief Minister DK Shivakumar) తెలిపారు. నగరంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... బెంగళూరు గ్రామీణ నుంచి తన తమ్ముడు డీకే సురేశ్‌(DK Suresh) ఓటమికి తన వ్యక్తిగత బాధ్యతగా భావిస్తున్నా అన్నారు.

- ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌

బెంగళూరు: బెంగళూరు గ్రామీణ నియోజకవర్గం ఓటమికి వ్యక్తిగతంగా తనదే బాధ్యత అని ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌(Deputy Chief Minister DK Shivakumar) తెలిపారు. నగరంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... బెంగళూరు గ్రామీణ నుంచి తన తమ్ముడు డీకే సురేశ్‌(DK Suresh) ఓటమికి తన వ్యక్తిగత బాధ్యతగా భావిస్తున్నా అన్నారు. ఓటమి నుంచి కోలుకోవాల్సి ఉందన్నారు. ఓడినంత మాత్రాన మౌనంగా ఉండేది లేదన్నారు. కాంగ్రెస్‌ వ్యతిరేక ఓట్లు ఒక్కటవుతాయని భావించా అన్నారు. మైనారిటీల ఓట్లు మినహా బీజేపీ, జేడీఎస్‌(BJP, JDS) కార్యకర్తల ఓట్లన్నీ వస్తాయని భావించామన్నారు. ఈ స్థాయిలో ఫలితం ఉంటుందని ఊహించలేదన్నారు. చెన్నపట్టణ ఎమ్మెల్యే స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో డీకే సురేశ్‌ పోటీ చేసే విషయం ఇంకా ప్రస్తావనకు రాలేదన్నారు. ఇప్పుడిప్పుడే ఓటమి నుంచి కోలుకుంటున్నామని పేర్కొన్నారు.

ఇదికూడా చదవండి: Chennai: అన్నామలైకి కేంద్రమంత్రి పదవి? అదేగాని జరిగితే ఇక రాష్ట్రంలో అధికారపార్టీకి...


ఓడిపోయామని ఇంట్లో కూర్చునేది లేదని, తనను నమ్మిన కార్యకర్తలు, ప్రజలకు శక్తిని నింపేలా పనిచేస్తా అన్నారు. కార్యకర్తల రక్షణకు ఏం చేయాలో పరిశీలిస్తామన్నారు. ఎంతోమంది పెద్దనాయకులే ఓడిపోయిన సందర్భాలు ఉన్నాయన్నారు. 14 స్థానాల్లో విజయం సాధిస్తామని భావించామన్నారు. ఒక్కస్థానం నుంచి 9 స్థానాలకు పెరిగామన్నారు. ఇంకా ఎక్కువ స్థానాలు లక్ష్యంగా ఉన్నా సాధ్యం కాలేదన్నారు. తన నియోజకవర్గ పరిధిలో డాక్టర్‌ సీఎన్‌ మంజునాథ్‌ గెలుపొందారని, వ్యక్తిగతంగా అభినందిస్తున్నా అన్నారు. పార్టీ కంటే అక్కడ వ్యక్తి గెలిచారని పేర్కొన్నారు. ఇంత తేడా ఊహించలేదన్నారు. డీకే సురేశ్‌ బాగా పనిచేశారని, ప్రభుత్వంపై వ్యతిరేకత లేదన్నారు. డాక్టర్‌ మంజునాథ్‌కు ఒక అవకాశం ఇవ్వాలని గెలిపించారని పేర్కొన్నారు. కనకపురలో 60వేల మెజారిటీ వస్తుందని భావించామని కానీ సాధ్యం కాలేదన్నారు. ఫలితాల ద్వారా ప్రజలు ఇచ్చిన సందేశాన్ని అంగీకరిస్తానని తెలిపారు.


ఇదికూడా చదవండి: Hyderabad: మీపై ఫెమా కేసు.. అరెస్ట్‌ తప్పదంటూ బెదిరింపులు

Read Latest Telangana News and National News

Read Latest AP News and Telugu News

Updated Date - Jun 08 , 2024 | 12:49 PM

Advertising
Advertising