ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Rail Track: రైల్వే ట్రాక్‌పై గ్యాస్ సిలిండర్లు, డిటోనేటర్లు.. తృటిలో తప్పిన రైలు ప్రమాదం

ABN, Publish Date - Sep 22 , 2024 | 05:14 PM

దేశంలోని వివిధ ప్రాంతాల్లో రైల్వే ట్రాక్‌లపై గ్యాస్ సిలిండర్లు, డిటోనేటర్లు, సిమెంట్ దిమ్మలు ఇంకా ప్రత్యక్షమవుతున్నాయి. ఉత్తరప్రదేశ్‌‌లో కాన్పూర్‌ సమీపంలోని ప్రేమ్‌పూర్ రైల్వే‌స్టేషన్ సమీపంలోని రైల్వే ట్రాక్‌పై గ్యాస్ సిలెండర్‌ను ఆదివారం రైల్వే లోకో పైలట్ గమనించారు.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 22: దేశంలోని వివిధ ప్రాంతాల్లో రైల్వే ట్రాక్‌లపై గ్యాస్ సిలిండర్లు, డిటోనేటర్లు, సిమెంట్ దిమ్మలు ఇంకా ప్రత్యక్షమవుతున్నాయి. ఉత్తరప్రదేశ్‌‌లో కాన్పూర్‌ సమీపంలోని ప్రేమ్‌పూర్ రైల్వే‌స్టేషన్ సమీపంలోని రైల్వే ట్రాక్‌పై గ్యాస్ సిలెండర్‌ను ఆదివారం రైల్వే లోకో పైలట్ గమనించారు. దీంతో రైలును లోక్ పైలట్ ఆపేశారు. అనంతరం రైల్వే శాఖ ఉన్నతాధికారులతోపాటు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో వారు ట్రాక్ వద్దకు చేరుకున్నారు.


అయితే ట్రాక్‌పై గుర్తించిన గ్యాస్ సిలండర్ ఖాళీదని ఈ సందర్భంగా వారు గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు ఈ సెప్టెంబర్ 8వ తేదీన రైల్వే ట్రాక్‌పై గ్యాస్ సిలిండర్ కారణంగా ప్రయాగ్ రాజ్ నుంచి బివానీ వెళ్తున్న కాళింది ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పిన సంగతి తెలిసిందే.


ఇంకోవైపు మధ్యప్రదేశ్‌లోని బ్రుహన్‌పూర్ జిల్లాలో గత బుధవారం రైల్వే ట్రాక్‌పై 10 డిటోనేటర్లును లోక్ పైలట్ గుర్తించి రైలును ఆపి వేయడంతో పెను ప్రమాదం తప్పింది. జమ్మూ కశ్మీర్ నుంచి కర్ణాటకకు ఆర్మీ జవాన్లతో వెళ్తున్న ఈ ప్రత్యేక రైలు లక్ష్యంగా ఈ డిటోనేటర్లు అమర్చినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.


ఈ నేపథ్యంలో తీవ్రవాద వ్యతిరేక దళం, జాతీయ దర్యాప్తు సంస్థతోపాటు స్థానిక పోలీసులు ఈ ఘటనపై విచారణ జరుపుతున్నారు. దేశంలో ఇప్పటికే పలు రైలు ప్రమాదాలు చోటు చేసుకోన్నాయి. ఈ నేపథ్యంలో మోదీ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తాయి. అలాంటి వేళ.. రైలు ప్రమాదాలను నిరోధించేందుకు కేంద్రం పలు ప్రత్యేక చర్యలు చేపట్టింది. అందులోభాగంగా రైల్వే ఉన్నతాధికారులకు స్పష్టమైన మార్గదర్శకాలను జారీ చేసింది.

For More National News And Telugu News...

Updated Date - Sep 22 , 2024 | 05:14 PM