ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Deve Gowda: ప్రజ్వల్ రేవణ్ణ కేసులో బాంబు పేల్చిన దేవెగౌడ

ABN, Publish Date - May 18 , 2024 | 03:15 PM

కర్ణాటకతో పాటు దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ప్రజల్వ్ రేవణ్ణ లైంగిక వేధింపుల కేసులో మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ మౌనం వీడారు. ఈ కేసులో మరింత మంది ప్రమేయం ఉందనే సంకేతాలిచ్చారు. ఈ కేసులో ఎవరెవరికి ప్రమేయం ఉందో వారందరిపైన చర్యలు తీసుకోవాలన్నారు. అయితే వారి పేర్లు తాను చెప్పదలచుకోలేదన్నారు.

బెంగళూరు: కర్ణాటకతో పాటు దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ప్రజల్వ్ రేవణ్ణ (Prajwal Revanna) లైంగిక వేధింపుల కేసులో మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ (HD Deve Gowda) మౌనం వీడారు. ఈ కేసులో మరింత మంది ప్రమేయం ఉందనే సంకేతాలిచ్చారు. ఈ కేసులో ఎవరెవరికి ప్రమేయం ఉందో వారందరిపైన చర్యలు తీసుకోవాలన్నారు. అయితే వారి పేర్లు తాను చెప్పదలచుకోలేదన్నారు.


ప్రజ్వల్ రేవణ్ణ పలువురు మహిళలపై లైంగిక దాడులు జరిపినట్టు ఇటీవల 2,700 వీడియోలు వెలుగులోకి వచ్చాయి. అదికూడా లోక్‌సభ ఎన్నికల సమయంలో వెలుగుచూడటం రాజకీయంగా సంచలనమైంది. ఇదే సమయంలో ప్రజ్వల్ రేవణ్ణ దేశాన్ని వదిలి జర్మనీకి వెళ్లారు. ఈ కేసుపై దర్యాప్తును 'సిట్'కు కర్ణాటక ప్రభుత్వం అప్పగించగా తొలుత ప్రజ్వల్‌కు సమన్లు పంపిన 'సిట్' ఆ తర్వాత లుకౌట్ నోటీసులు జారీ చేసింది. అతన్ని వెనక్కి తీసుకురావడానికి బ్లూ కార్నర్ నోటీసు సైతం జారీ అయింది. ఈ కేసులో మొదట్నించీ మౌనంగా ఉన్న దేవెగౌడ ఎట్టకేలకు పెదవి విప్పారు. తన మనువడు ప్రజల్వ్‌పై నేరం చేసినట్టు రుజువైతే చర్య తీసుకోవచ్చని, అయితే తన కుమారుడు హెచ్‌డీ రేవణ్ణపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో అందరూ చూశారని, ఆయనకు కోర్టు బెయిల్ ఇచ్చిందని, మరో ఆర్డర్ పెండింగ్‌లో ఉందని చెప్పారు. బాధిత మహిళలందరికీ న్యాయం జరగాలని అన్నారు. బాధిత మహిళను కిడ్నాప్ చేశారనే ఆరోపణతో హెచ్‌డీ రేవణ్ణను ఈనెల మొదట్లో అరెస్టు చేయగా, ఆ తర్వాత ఆయనకు బెయిల్ మంజూరైంది.

DK Shivakumar: వంద కోట్ల ఆఫర్.. కాదనడంతో జైలుకు..?


పుట్టినరోజు వేడుకలకు దూరంగా దేవెగౌడ

దేవెగౌడ శనివారంనాడు 91వ సంవత్సరంలోకి అడుగుపెట్టాడు. అయితే తన కుటుంబ సభ్యులపై ఆరోపణలు చుట్టుముట్టిన నేపథ్యంలో ఆయన ఈసారి తన పుట్టినరోజు వేడుకలకు దూరంగా ఉన్నారు.

Read Latest National News and Telugu News

Updated Date - May 18 , 2024 | 03:29 PM

Advertising
Advertising