ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Rahul Gandhi: రాహుల్ గాంధీకి దేవేంద్ర ఫడ్నవిస్ సవాల్.. ఆ పని చేయగలరా?

ABN, Publish Date - Mar 16 , 2024 | 10:04 PM

ఎలక్టోరల్ బాండ్ల (Electoral Bonds) వ్యవహారంపై బీజేపీపై (BJP) కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) చేసిన విమర్శలకు మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ (Devendra Fadnavis) కౌంటర్ ఇచ్చారు. తమ కాంగ్రెస్ పార్టీ (Congress Party) అందుకున్న ఎలక్టోరల్ బాండ్లను రాహుల్ తిరిగి ఇస్తారా? అని ప్రశ్నించారు.

ఎలక్టోరల్ బాండ్ల (Electoral Bonds) వ్యవహారంపై బీజేపీపై (BJP) కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) చేసిన విమర్శలకు మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ (Devendra Fadnavis) కౌంటర్ ఇచ్చారు. తమ కాంగ్రెస్ పార్టీ (Congress Party) అందుకున్న ఎలక్టోరల్ బాండ్లను రాహుల్ తిరిగి ఇస్తారా? అని ప్రశ్నించారు. ఎన్నికల నిధుల రూపంలో కాంగ్రెస్ పార్టీ అందుకునే నల్లధనాన్ని ఈ ఎలక్టోరల్ బాండ్ స్కీమ్ నిలిపివేసిందని.. అందుకే రాహుల్ ఇలా విమర్శలు చేశారని ఆయన మండిపడ్డారు.


తన భారత్ జోడో న్యాయ్ యాత్రలో (Bharat Jodo Nyay Yatra) భాగంగా రాహుల్ గాంధీ శనివారం ఎలక్టోరల్ బాండ్ల స్కీమ్ విషయంలో నరేంద్ర మోదీ (Narendra Modi) నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వాన్ని (Central Government) లక్ష్యంగా చేసుకున్నారు. ప్రభుత్వాలను పడగొట్టడానికి, రాజకీయ పార్టీలను విచ్ఛిన్నం చేయడానికి.. బీజేపీ ఈ పథకాన్ని ఓ ‘దోపిడీ రాకెట్’గా వినియోగించిందని ఆరోపించారు. ఇందుకు ఫడ్నవిస్ బదులిస్తూ.. 303 మంది ఎంపీలతో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించింది కాబట్టి తమకు ఎలక్టోరల్ బాండ్లలో 30 శాతం వచ్చిందని అన్నారు. కానీ.. కాంగ్రెస్‌తో పాటు ఇతర ప్రతిపక్షాలకు 70 శాతం వచ్చాయని వివరణ ఇచ్చారు. ఈ స్కీమ్ విషయంలో బీజేపీపై విమర్శలు చేస్తున్న రాహుల్ గాంధీ.. కాంగ్రెస్‌కు అందిన ఎలక్టోరల్ బాండ్లను తిరిగి ఇస్తారా? అని నిలదీశారు. ఆ పార్టీ ఎవరిని బెదిరించి నిధులు తెచ్చుకుందని ధ్వజమెత్తారు.

ఎలక్టోరల్ బాండ్లు అనేది రాజకీయ పార్టీల (Political Parties) బ్యాలెన్స్ షీట్‌లో, అలాగే కార్పొరేట్ సంస్థల బ్యాలెన్స్ షీట్‌లో చూపబడిన డబ్బు అని దేవేంద్ర ఫడ్నవిస్ తెలిపారు. ఒకవేళ ఈ స్కీమ్‌లో ఏవైనా లొసుగులు ఉంటే.. వాటిని కోర్టు పరిష్కరిస్తుందని అన్నారు. కాంగ్రెస్ నల్లధనం మూలం మూసివేయబడింది కాబట్టే రాహుల్ ఈ స్కీమ్‌పై విరుచుకుపడ్డారంటూ దుయ్యబట్టారు. కాంగ్రెస్ ఎన్నికల నిధుల కోసం నల్లధనాన్ని కోరుకుంటోందని ఆయన ఆరోపించారు. ప్రధాని మోదీకి వ్యతిరేకంగా మాట్లాడే హక్కు రాహుల్ లేదని, దేశంలో కేవలం మోదీ గ్యారెంటీ (Modi Guarantee) మాత్రమే పని చేస్తుందని, ఈ విషయం దేశ ప్రజలకు కూడా తెలుసని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా మోదీకి ఉన్న ప్రజాదరణ చూసి రాహుల్ కలత చెందుతున్నారని ఫడ్నవిస్ ఎద్దేవా చేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Mar 16 , 2024 | 10:04 PM

Advertising
Advertising