ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Fadnavis Dials Shinde: షిండేకు ఫడ్నవిస్ ఫోన్..ఏం జరిగిందంటే

ABN, Publish Date - Dec 01 , 2024 | 03:21 PM

మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు, క్యాబినెట్ పదవుల్లో వాటాపై ఢిల్లీలో కేంద్ర నేతలతో ఇటీవల సమావేశమైన షిండే ఆ తర్వాత ముంబై చేరుకున్నారు. అనంతరం కీలక సమావేశాలను రద్దు చేసుకుని మూడ్రోజుల కిత్రం తన స్వగ్రామానికి ఆయన వెళ్లిపోయారు.

ముంబై: మహారాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే (Eknath Shinde)కు బీజేపీ సీనియర్ నేత దేవేంద్ర ఫడ్నవిస్ (Devendra Fadnavis) ఆదివారంనాడు ఫోన్ చేశారు. సతారా జిల్లాలోని తన స్వగ్రామంలో షిండే గత మూడు రోజులుగా ఉన్నారు. విషజ్వరంతో చికిత్స పొందుతున్న ఆయనకు ఫడ్నవిస్ ఫోన్ చేసి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఆదివారం సాయంత్రం షిండే తిరిగి ముంబైకి వస్తారని తెలుస్తోంది.

Delhi Assembly Elections: కేజ్రీవాల్ బిగ్ అనౌన్స్‌మెంట్


మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు, క్యాబినెట్ పదవుల్లో వాటాపై ఢిల్లీలో కేంద్ర నేతలతో ఇటీవల సమావేశమైన షిండే ఆ తర్వాత ముంబై చేరుకున్నారు. అనంతరం కీలక సమావేశాలను రద్దు చేసుకుని మూడ్రోజుల కిత్రం తన స్వగ్రామానికి ఆయన వెళ్లిపోయారు. శనివారం జ్వరతీవ్రత కారణంగా వైద్యుల బృందం ఆయనకు పరీక్షలు నిర్వహించింది. జ్వరం, గొంతు ఇన్‌ఫెక్షన్‌తో ఆయన బాధపడుతున్నారని, సెలైన్ ఇచ్చామని కుటుంబ వైద్యుడు పర్తే తెలిపారు. మరో రెండ్రోజుల్లో ఆయనకు పూర్తి స్వస్థత చేకూరవచ్చన్నారు.


ప్రమాణస్వీకారానికి ప్రధాని

మరోవైపు, మహాయుతి కొత్త ప్రభుత్వం ప్రమాణస్వీకారం డిసెంబర్ 5న ఉంటుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్ బవాంకులే తెలిపారు. ముంబైలోని ఆజాద్ మైదానంలో జరిగే ఈ కార్యక్రమంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వస్తారని చెప్పారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నవంబర్ 23న వెలువడగా మహాయుతి కూటమి భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనేది మాత్రం ఇంకా ఖరారు కాలేదు. బీజేపీ 132 సీట్లతో ఏకైక పెద్ద పార్టీగా అవతరించగా, కూటమి భాగస్వాములైన షిండే శివసేన 57, అజిత్ పవార్ ఎన్‌సీపీ 41 సీట్లు గెలుచుకున్నాయి.


ఇవి కూడా చదవండి

Fire Accident: 61 మంది భక్తులతో వెళ్తున్న బస్సుకు భారీ అగ్ని ప్రమాదం.. చివరకు..

Heavy Raind: చెన్నై నగరాన్ని ముంచెత్తిన ‘ఫెంగల్’..

Read More National News and Latest Telugu News

Updated Date - Dec 01 , 2024 | 03:21 PM