Maharashtra: విశ్వాస పరీక్షలో నెగ్గిన ఫడ్నవిస్ సర్కార్
ABN, Publish Date - Dec 09 , 2024 | 03:59 PM
ఏక్‌నాథ్ షిండే నాయకత్వంలోని శివసేన ఎమ్మెల్యే ఉదయ్ సామంత్, ఎన్‌సీపీ నేత దిలీప్ వాల్సే పాటిల్, బీజేపీ నేత సంజయ్ కుటే తదితరులు అసెంబ్లీలో విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.
ముంబై: దేవేంద్ర ఫడ్నవిస్ (Devendra Fadnavis) సారథ్యంలోని 'మహాయుతి' కూటమి ప్రభుత్వం సోమవారంనాడు అసెంబ్లీలో జరిగిన విశ్వాస పరీక్షలో (confidence vote) నెగ్గింది. ఏక్‌నాథ్ షిండే నాయకత్వంలోని శివసేన ఎమ్మెల్యే ఉదయ్ సామంత్, ఎన్‌సీపీ నేత దిలీప్ వాల్సే పాటిల్, బీజేపీ నేత సంజయ్ కుటే తదితరులు అసెంబ్లీలో విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. మూజువాణి ఓటుతో విశ్వాస తీర్మానాన్ని సభ ఆమోదించింది. 237 మంది ఎమ్మెల్యేలు విశ్వాస తీర్మానానికి మద్దతు తెలిపారు. విశ్వాస తీర్మానం మెజారిటీతో సభామోదం పొందినట్టు అసెంబ్లీ స్పీకర్ రాహుల్ నార్వేకర్ ప్రకటించారు. 288 మంది సభ్యుల అసెంబ్లీలో మహాయుతి కూటమికి 230 మంది సభ్యుల బలం ఉంది.
Rajya Sabha bypolls: పెద్దల సభకు ఏపీ, హర్యానా, ఒడిశా అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ
మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా మూడోసారి దేవేంద్ర ఫడ్నవిస్ డిసెంబర్ 5న ప్రమాణ స్వీకారం చేశారు. ఏక్‌నాథ్ షిండే, అజిత్ పవార్ ఉపముఖ్యమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ముంబై ఆజాద్ మైదానంలో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హజరయ్యారు.
కాగా, అధికారికంగా డిసెంబర్ 7 నుంచి మహారాష్ట్ర 15వ లెజిస్లేటివ్ అసెంబ్లీ పదవీకాలం ప్రారంభమైంది. 230 మంది సభ్యుల బలం 'మహాయుతి'కి ఉండటంతో లాంఛప్రాయంగా సభా విశ్వాసం నిర్వహించారు. అసెంబ్లీ స్పీకర్‌గా నార్వేకర్ నియమితులు కావడంతో, చిన్న పార్టీలు, స్వతంత్ర్య ఎమ్మెల్యేలతో కలిసి మహాయుతి కూటమికి అసెంబ్లీలో 229 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. విపక్ష 'మహా వికాస్ అఘాడి'లోని ఉద్ధవ్ థాకరే శివసేన (యూబీటీ)కి 20, కాంగ్రెస్‌కు 16, శరద్ పవార్ ఎన్సీపీ (ఎస్‌పీ)కి 10 మంది సభ్యుల బలం ఉంది. సమాజ్‌వాదీ పార్టీకి 2, పీడ్ల్యూపీ, ఏఐఎంఐఎంకు ఒక్కో సభ్యుడు ఉన్నారు.
ఇవి కూడా చదవండి..
పాక్‌కు బంగ్లా మరింత చేరువ!
Vikram Misri: హిందువులపై దాడులు.. బంగ్లాదేశ్ చేరుకున్న విదేశాంగ కార్యదర్శి
For National News And Telugu News
Updated Date - Dec 09 , 2024 | 04:07 PM