ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Indian Railway: సీసీ టీవీలపై అసత్య ప్రచారం.. రంగంలోకి దిగిన భారతీయ రైల్వే

ABN, Publish Date - Nov 22 , 2024 | 03:13 PM

రైల్వే బోగీల్లో సీసీ టీవీలు అమర్చేందుకు వేలాది కోట్ల రూపాయిల టెండర్లకు భారతీయ రైల్వే ఆహ్వానించిందంటూ వార్త కథనాల్లో ప్రచురితమవుతుంది. దీనిపై భారతీయ రైల్వేతోపాటు ప్రెస్ ఇన్‌ఫర్మేషన్ బ్యూరో స్పందించింది.

న్యూఢిల్లీ, నవంబర్ 22: రైల్వే బోగీలలో సీసీ కెమెరాలు అమర్చేందుకు రూ. 20 వేల కోట్లకు భారతీయ రైల్వే టెండర్లకు పిలిచిందంటూ మీడియాలో వస్తున్న వార్త కథనాలపై ప్రెస్ ఇన్‌ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) శుక్రవారం న్యూఢిల్లీలో స్పందించింది. ఇది తప్పుడు సమాచారమని పీఐబీ స్పష్టం చేసింది. రైల్వే బోగీల్లో సీసీ కెమెరాలు అమర్చేందుకు ఎటువంటి టెండర్లను పిలువ లేదని పేర్కొంది.


ప్రస్తుతం ఈ అంశం ఆర్థిక శాఖ పరిధిలో ఉందని.. దీనిని సమీక్షిస్తుందని తెలిపింది. దీనిపై ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని పీఐబీ స్పష్టత ఇచ్చింది. బోగీల్లో సీసీ కెమెరాల అంశం వాస్తవమో.. కాదో నిర్ధారించుకోకుండా ఇలా ప్రచురించడం.. ఓ విధంగా ప్రజలను పక్క దారి పట్టించడమే అవుతుందని అభిప్రాయపడింది. అయితే సీసీ టీవీల కోసం వేలాది కోట్ల రూపాయిలు టెండర్లకు పిలిచారంటూ జరగుతున్న ప్రచారాన్ని పీఐబీ ఈ సందర్భంగా ఖండించింది. ఇది కేవలం ఊహజనితమైనవని.. ఏ మాత్రం ఆధారం లేనివని పీఐబీ తెలిపింది.


ఏదైనా సమాచారాన్ని ప్రచురించే ముందు అధికారిక వర్గాల ద్వారా సదరు అంశంపై స్పష్టత తీసుకోవాలని చెప్పింది. అనంతరం అందుకు సంబంధించిన వార్త కథనాన్ని ప్రచురించాలని ఈ సందర్భంగా పత్రికా సంస్థలకు ప్రెస్ ఇన్‌ఫర్మేషన్ బ్యూరో సూచించింది. అలా కాకుండా.. సరైన సమాచారం లేకుండా నిరాధారమైన వార్తలు రాయడం వల్ల భారతీయ రైల్వేకు ఉన్న పేరు ప్రఖ్యాతలకు తీవ్ర విఘాతం కలుగుతుందని ఆందోళన వ్యక్తం చేసింది.


ఇదే అంశంపై భారతీయ రైల్వే సైతం స్పందించింది. ప్రయాణికుల భద్రత, సమర్థత, పారదర్శకత పట్ల తమకు పూర్తి నిబద్దత ఉందని పునరుద్ఘాటించింది. రైల్వేలకు సంబంధించి కచ్చితమైన అప్ డేట్‌లను భారతీయ రైల్వే లేదా ప్రెస్ ఇన్పర్మేషన్ బ్యూరో (పీఐబీ) ద్వారా అధికారికంగా ఇస్తుందని తెలిపింది. తద్వారా వచ్చిన సమాచారాన్ని మాత్రమే ప్రచురించాలని మీడియా సంస్థలకు భారతీయ రైల్వే క్లారిటీ ఇచ్చింది.


భారతీయ రైల్వే.. ఆసియా ఖండంలోనే అతి పెద్దది. ఇందులో లక్షలాది రైళ్లు, కోట్లాది మంది ఉద్యోగులు ఉన్నారు. ఈ భారతీయ రైల్వేలో కేంద్రం ఇప్పటికే పలు సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. అందులోభాగంగా రైల్వే బోగీల్లో జరుగుతున్న నేరాలను అదుపు చేసేందుకు కసరత్తు చేస్తుంది. ఆ క్రమంలో దేశంలో అన్ని రైల్వే డివిజనుల్లోని బోగీల్లో సీసీ కెమెరాలను అమర్చాలని భారతీయ రైల్వే భావిస్తుంది. దీంతో ఈ అంశంపై ఉన్నత స్థాయిలో చర్చలు జరుగుతున్నాయి. అవి ఇంకా ఓ కొలిక్కి రాలేదు. అలాంటి వేళ.. రూ. 20 వేల కోట్లతో టెండర్లను రైల్వే శాఖ పిలిచిందంటూ మీడియాలో కథనాలు ప్రచురితమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రెస్ ఇన్‌ఫర్మేషన్ బ్యూరోపై విధంగా స్పందించింది.

For National News And Telugu News

Updated Date - Nov 22 , 2024 | 03:24 PM