ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

MLA: శివసేన ఎమ్మెల్యే నోటి దురుసు.. మీ పేరంట్స్ నాకు ఓటు వేయకుంటే అన్నం తినొద్దు

ABN, Publish Date - Feb 11 , 2024 | 10:30 AM

శివసేనకు చెందిన ఎమ్మెల్యే ఒకరు నోటి దురుసును ప్రదర్శించారు. తనకు ఓటు వేయించాలని పిల్లలను కోరారు. ఎన్నికలకు సంబంధించిన అంశాల్లో పిల్లల గురించి మాట్లాడొద్దని ఎన్నికల సంఘం స్పష్టంచేసింది. ఆ ప్రకటన చేసి వారం రోజులు గడవక ముందే కలమ్ నూరి ఎమ్మెల్యే సంతోష్ బంగర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

ముంబై: శివసేనకు (Shiva Sena) చెందిన ఎమ్మెల్యే ఒకరు నోటి దురుసును ప్రదర్శించారు. తనకు ఓటు వేయించాలని పిల్లలను కోరారు. ఈ ఘటన తీవ్ర దుమారం రేపుతోంది. ఎన్నికలకు సంబంధించిన అంశాల్లో పిల్లల గురించి మాట్లాడొద్దని ఎన్నికల సంఘం స్పష్టంచేసింది. ఆ ప్రకటన చేసి వారం రోజులు గడవక ముందే కలమ్ నూరి ఎమ్మెల్యే సంతోష్ బంగర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

ఏం జరిగిందంటే..?

హింగోలి జిల్లాలో జిల్లా పరిషత్ పాఠశాలకు ఎమ్మెల్యే సంతోష్ బంగర్ వచ్చారు. అక్కడ విద్యార్థులతో మాట్లాడారు. 10 ఏళ్ల లోపు విద్యార్థులతో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘మీ తల్లిదండ్రుల చేత నాకు ఓటు వేయించండి. నాకు ఓటు వేసేలా చూడండి. ఓటు వేసే అంశంపై మీ పేరంట్స్ క్లారిటీ ఇవ్వకుంటే మీరు అన్నం తినడం మానేయండి. అలా రెండు రోజులు చేయండి. దీంతో పేరంట్స్ దిగి వస్తారు. ఏం కావాలి అని అడుగుతారు. ఆ సమయంలో సంతోష్ బంగర్‌కు ఓటు వేయాలని కోరండి. అప్పుడు మాత్రమే అన్నం తింటాం అని చెప్పండి. ఎవరు ముందు చెబుతారో చెప్పండి అని’ సంతోష్ బంగర్ అన్నారు.

విపక్షాల విమర్శలు

సంతోష్ బంగార్ వ్యాఖ్యలను ప్రతిపక్షాలు ముక్తకంఠంతో ఖండించాయి. ఈసీ నిబంధనలను సంతోష్ బంగర్ ఉల్లంఘించాడని, అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎన్సీపీ-ఎస్పీ అధికార ప్రతినిధి క్రాస్టో డిమాండ్ చేశారు. గతంలో కూడా సంతోష్ బంగర్ కాంట్రవర్సీ కామెంట్స్ చేశారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ గెలుస్తోందని ధీమా వ్యక్తం చేశారు. మరోసారి మోదీ ప్రధాని కాకుంటే ఉరి వేసుకొని చనిపోతానని సంచలన వ్యాఖ్యలు చేశారు. గత ఏడాది ఉత్సవాల సమయంలో బంగార్ కత్తిని చూపించారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Feb 11 , 2024 | 10:30 AM

Advertising
Advertising