Govt Employees: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు షాక్.. ఇక ఆ నిబంధన తప్పనిసరి
ABN, Publish Date - Jun 22 , 2024 | 06:30 PM
నిత్యం ఆలస్యంగా ఆఫీసుకు వెళ్లే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు(Central Govt Employees) సర్కార్ షాక్ ఇచ్చింది. కేంద్ర సిబ్బంది, శిక్షణ విభాగం (DoPT) సీనియర్ అధికారులతో సహా ఉద్యోగులందరూ తప్పనిసరిగా 9.15లోపే బయోమెట్రిక్ అటెండెన్స్(Biometric Attendence) వేయాలని స్పష్టం చేసింది.
ఢిల్లీ: నిత్యం ఆలస్యంగా ఆఫీసుకు వెళ్లే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు(Central Govt Employees) సర్కార్ షాక్ ఇచ్చింది. కేంద్ర సిబ్బంది, శిక్షణ విభాగం (DoPT) సీనియర్ అధికారులతో సహా ఉద్యోగులందరూ తప్పనిసరిగా 9.15లోపే బయోమెట్రిక్ అటెండెన్స్(Biometric Attendence) వేయాలని స్పష్టం చేసింది.
ఆలస్యంగా వచ్చే వారిని గాడిలో పెట్టేందుకు ఈ నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. అయితే 15 నిమిషాల ఆలస్యాన్ని(గ్రేస్ పీరియడ్) కేంద్రం అనుమతించింది. కొత్త రూల్ ప్రకారం ఉద్యోగులు.. ఉదయం 9.00 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు విధుల్లో ఉండాలి. ఉదయం 15 నిమిషాలు గ్రేస్ పీరియడ్ సదుపాయం ఉంటుంది. ఉద్యోగి 15 నిమిషాలయినా ఆఫీస్‌కి రాకపోతే దాన్ని హాఫ్ డే సెలవుగా పరిగణిస్తారు.
అయితే నెలలో రెండు రోజులకు ఈ నిబంధన నుంచి మినహాయింపు ఉంటుంది. రెండు రోజులకు మించి గ్రేస్ పీరియడ్ తర్వాత ఆఫీస్‌కు వస్తే.. అదనంగా ఆలస్యం చేసే ఒక్కోరోజు హాఫ్ డే వేతనంలో కోత విధించనున్నారు. అయితే ఉద్యోగికి CLs ఉంటే వాటి నుంచి హాఫ్ డే సెలవును మినహాయించనున్నారు.
క్యాజువల్ సెలవులు లేకపోతే ఎర్న్‌డ్ లీవుల (ELs) నుంచి తగ్గించనున్నారు. అవి కూడా లేకపోతే శాలరీలో కోత విధించనున్నారు. ఆలస్యంగా వచ్చే వాళ్లతోపాటు త్వరగా ఆఫీస్ నుంచి వెళ్లిపోయే వాళ్లకు కూడా ఈ నియమం వర్తిస్తుంది. ఈ అంశంపై ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆఫీసులో పని ఎక్కువగా ఉన్న రోజుల్లో అదనంగా 3-4 గంటలు పని చేస్తున్నామని.. దానికి తమకు అదనంగా డబ్బులు చెల్లించట్లేదు కదా అని అంటున్నారు.
Read Latest Telangana News and National News
Updated Date - Jun 22 , 2024 | 06:30 PM