606 పోస్టల్ పార్సిళ్లలో రూ.21 కోట్ల డ్రగ్స్
ABN, Publish Date - Oct 19 , 2024 | 03:18 AM
బెంగళూరు చామరాజపేట ఫారిన్ పోస్టాఫీ్‌సకు వివిధ దేశాల నుంచి వచ్చిన 606 పార్సిల్స్‌లో రూ.21 కోట్ల విలువైన డ్రగ్స్‌ను పోలీసులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.
బెంగళూరు, అక్టోబరు 18(ఆంధ్రజ్యోతి): బెంగళూరు చామరాజపేట ఫారిన్ పోస్టాఫీ్‌సకు వివిధ దేశాల నుంచి వచ్చిన 606 పార్సిల్స్‌లో రూ.21 కోట్ల విలువైన డ్రగ్స్‌ను పోలీసులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. కొన్ని నెలలకాలంగా ఈ పార్సిల్స్ డెలివరీ కాలేదు. అమెరికా, బ్రిటన్‌తోపాటు ఆఫ్రికా దేశాలనుంచి ఈ డ్రగ్స్ వచ్చాయి. కొన్నేళ్ల నుంచి విదేశీ పార్సిల్స్‌పై సీసీబీ నార్కోటిక్ విభాగం ప్రత్యేక దృష్టి సారించింది. ఈ క్రమంలో పార్సిల్స్ తీసుకునేందుకు వస్తే పట్టుబడతామని భావించి.. విలువైన డ్రగ్స్‌ను పెడ్లర్‌లు వదులుకున్నారు. యూఎస్, యూకే, బెల్జియం, థాయ్‌ల్యాండ్, నెదర్లాండ్స్ వంటి దేశాలనుంచి వచ్చిన డ్రగ్స్‌ను డాగ్‌స్క్వాడ్ సాయంతో తనిఖీ చేశామని సీపీ దయానంద్ తెలిపారు. పార్సిల్స్ అడ్రెస్‌లు తప్పుగా ఉన్నట్లు గుర్తించామని అన్నారు.
Updated Date - Oct 19 , 2024 | 03:18 AM