ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

బికినీ వేసుకుతిరగడానికి కావాలొక దీవి!

ABN, Publish Date - Sep 27 , 2024 | 04:02 AM

భార్య బికినీ వేసుకోవాలి.. బీచ్‌లో హ్యాపీగా, జాలీగా తిరుగుతూ ఎంజాయ్‌ చేయాలి! అయితే తాను ఎవరి కంటనో పడి ఇబ్బంది పడటం అంటూ జరగొద్దు!! ఎలా సాధ్యం? సౌదీకి చెందిన వ్యాపారవేత్త జమాల్‌ అల్‌ నదాక్‌ అనే బడా వ్యాపారవేత్తకు ఇదే సవాలు ఎదురైతే చిటికెలో సుసాధ్యం చేసుకున్నాడు.

  • భార్య సరదా కోసం రూ.418 కోట్లతో

  • ద్వీపాన్నే కొన్న దుబాయ్‌ వ్యాపారవేత్త

న్యూఢిల్లీ, సెప్టెంబరు 26: భార్య బికినీ వేసుకోవాలి.. బీచ్‌లో హ్యాపీగా, జాలీగా తిరుగుతూ ఎంజాయ్‌ చేయాలి! అయితే తాను ఎవరి కంటనో పడి ఇబ్బంది పడటం అంటూ జరగొద్దు!! ఎలా సాధ్యం? సౌదీకి చెందిన వ్యాపారవేత్త జమాల్‌ అల్‌ నదాక్‌ అనే బడా వ్యాపారవేత్తకు ఇదే సవాలు ఎదురైతే చిటికెలో సుసాధ్యం చేసుకున్నాడు. భార్య ‘సరదా’ కోసం ప్రత్యేకంగా ఓ ద్వీపాన్నే కొన్నాడు. ఇందుకు రూ.418 కోట్లు ఖర్చు చేశాడు!

తనకు బికినీ ధరించి.. బీచ్‌లో తిరగాలనుందని భార్యామణి సౌదీ అల్‌ నదాక్‌ (26) చెప్పడంతోనే అదెంత పని అంటూ ఆమెకు హిందూ మహాసముద్రంలో ఓ దీవినే కొనిచ్చేశాడు. ఈ విషయాన్ని స్వయంగా సౌదీ అల్‌ నదాక్‌ ఇన్‌స్టా వేదికగా పంచుకొని.. ఆ ఐలెండ్‌ వీడియోనూ షేర్‌ చేసింది. ‘‘నేను బికినీ ధరించి.. బీచ్‌లో తిరగాలనుకున్నాను. అయితే బీచ్‌లో నేను సురక్షితంగా సేదతీరాలని నా భర్త అనుకున్నారు. ఆ ఆలోచన నుంచే ఓ ద్వీపాన్ని సొంతం చేసుకోవాలనే ఆలోచన వచ్చింది’’ ఆంటూ ఆమె ఓ మీడియా సంస్థకు వెల్లడించారు. అయితే గోప్యత, భద్రతకు ప్రాధాన్యమిస్తూ ఆ ద్వీపం వివరాలు వెల్లడించలేదు.

Updated Date - Sep 27 , 2024 | 04:02 AM