ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Lok Sabha Election: 543కు బదులుగా 544 సీట్లు...ఇది ఈసీ పొరపాటేనా?

ABN, Publish Date - Mar 16 , 2024 | 08:41 PM

లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ను ఈసీఐ శనివారం విడుదల చేస్తూ ఏడు విడతలు జరిగే ఎన్నికల మ్యాప్‌ను షేర్ చేసింది. అందులో ఎన్నికలు జరిగే నియోజకవర్గాల సంఖ్య 544గా ఉంది. వాస్తవానికి 543 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగాల్సి ఉన్నాయి. ఇదే ప్రశ్నను ఓ పాత్రికేయుడు ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ ముందుంచారు. ఇందుకు ఈసీ స్పందిస్తూ, మణిపూర్‌లోని ఓ నియోకవర్గంలో రెండుసార్లు ఎన్నికలు జరపబోతున్నట్టు చెప్పారు.

న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల (Lok Sabha Elections-2024) షెడ్యూల్‌ను భారత ఎన్నికల కమిషన్ (ECI) శనివారంనాడు విడుదల చేస్తూ ఏడు విడతలు జరిగే ఎన్నికల మ్యాప్‌ను షేర్ చేసింది. అందులో ఎన్నికలు జరిగే నియోజకవర్గాల సంఖ్య 544గా ఉంది. వాస్తవానికి 543 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగాల్సి ఉన్నాయి. ఇది ఈసీ పొరపాటు వల్లే జరిగిందా? ఎన్నికల షెడ్యూల్ ప్రకటన అనంతరం ఇదే ప్రశ్నను ఓ పాత్రికేయుడు ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ (Rajiv Kumar) ముందుంచారు. దీనికి ఆయన వెంటనే స్పందించారు. మణిపూర్‌లోని ఓ నియోకవర్గంలో రెండుసార్లు ఎన్నికలు జరపబోతున్నట్టు చెప్పారు. జాతుల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్న మణిపూర్‌లో ప్రత్యేక కారణాల వల్ల ఒకే నియోజకవర్గంలో రెండు సార్లు పోలింగ్ నిర్వహించాల్సి వస్తోందని వివరణ ఇచ్చారు.


కాగా, 543 లోక్‌సభ నియోజకవర్గాలకు ఏప్రిల్ 19వ తేదీతో పోలింగ్ ప్రారంభమై జూన్ 1న ఏడు విడతల్లో ముగియనుంది. జూన్ 4న ఓట్ల లెక్కింపు ఉంటుంది. తొలి విడత ఏప్రిల్ 19న, రెండో విడత ఏప్రిల్ 26న, మూడో విడత మే 7న, నాలుగో విడత మే 13న, ఐదో విడత మే 20న, ఆరో విడత మే 25న జరుగనుండగా, చివరిదైన 7వ విడత పోలింగ్ జూన్ 1న జరుగుతుంది.

Updated Date - Mar 16 , 2024 | 08:41 PM

Advertising
Advertising