Foreign funding: 8 దేశాల నుంచి 'ఆప్'కు నిధులు..హోం శాఖకు ఈడీ నివేదిక
ABN, Publish Date - May 20 , 2024 | 09:28 PM
'ఆమ్ ఆద్మీ పార్టీ' చుట్టూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) వల బిగుసుకుంటోంది. 2014-2022 మధ్య రూ.7.08 కోట్ల విదేశీ నిధులను 'ఆప్' అందుకుందంటూ హోం మంత్రిత్వ శాఖకు ఈడీ రిపోర్డ్ చేసింది.
న్యూఢిల్లీ: 'ఆమ్ ఆద్మీ పార్టీ' చుట్టూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) వల బిగుసుకుంటోంది. 2014-2022 మధ్య రూ.7.08 కోట్ల విదేశీ నిధులను 'ఆప్' అందుకుందంటూ హోం మంత్రిత్వ శాఖకు ఈడీ రిపోర్డ్ చేసింది. అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాడ్, సౌదీ అరేబియా, యూఏఈ, కువైట్, ఒమెన్‌ల నుంచి నిధులు వచ్చాయని, ఫారెన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ (FCRA), ప్రజాప్రాతినిధ్య చట్టం (RPA), ఇండియన్ పీనల్ కోడ్ (IPC) నిబంధనలను 'ఆప్' ఉల్లంఘించిదని హోం శాఖకు అందిజేసిన నివేదికలో ఈడీ చెప్పినట్టు తెలుస్తోంది.
డోనర్ల ఐడెంటిటీ దాచిపెట్టారు
ఇండియాలోని రాజకీయ పార్టీలకు విదేశీ నిధులను నియంత్రించేందుకు ఉద్దేశించిన లీగల్ ప్రొవిజన్లను ఒక క్రమపద్ధతిలో ఆప్ ఉల్లంఘించిందని, విరాళాలు ఇచ్చిన వారి (డోనర్ల) నిజమైన ఐడెంటిటీని దాచిపెట్టిందని ఈడీ ఆరోపించింది. నిధులు నేరుగా ఆప్ 'ఐడీబీఐ' అకౌంట్, ఎమ్మెల్యే దుర్గేష్ పాఠక సహా పార్టీ నేతల అకౌంట్లలో డిపాజిట్ అయ్యాయని ఈడీ తెలిపింది. దుర్గేష్ పాఠక్ 2016లో కెనడాలో జరిపిన ఒక ఈవెంట్ ద్వారా నిధులు సేకరించారని, వ్యక్తిగత ప్రయోజనాల కోసం వినియోగించారని పేర్కొంది. ఒకే పాస్‌పోర్ట్ నెంబర్లు, క్రెడిట్ కార్డులు, ఈమెయిల్ ఐడీలు, మొబైల్ నెంబర్లకు పలు డొనేషన్లు వచ్చినట్టు గుర్తించామని తెలిపింది. ఒక డ్రగ్స్ స్మగ్లింగ్ కేసుపై ఇన్వెస్టిగేషన్ చేస్తుండగా 'ఆప్' విదేశీ నిధులకు సబంధించిన డాక్యుమెంట్లు బయటపడ్డాయని, ఆప్ ఎమ్మెల్యే సింగ్ ఖైరా ప్రమేయం ఇందులో ఉన్నట్టు తెలుస్తోందని ఈడీ పేర్కొంది. ఖైరా సైతం 2017 పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు అమెరికాలో ఫారెన్ ఫండ్ రైజింగ్ ప్రచారం చేపట్టినట్టు అంగీకరించారని తెలిపింది.
Lok Sabha Elections: ముగిసిన ఐదో విడత ఎన్నికలు.. 56.7 శాతం పోలింగ్ నమోదు
కాగా, చెక్కులు, ఆన్‌లైన్ పోర్టల్స్ ద్వారా 'ఆప్' విదేశీనిధులు అందుకున్నట్టు నేషనల్ సెక్రటరీ పంకజ్ గుప్తా గుర్తించారని, గుప్తా డాటాను విశ్లేషిస్తే విదేశీ డొనేషన్ల చట్టాలను ఉల్లంఘిచినట్టు స్పష్టమవుతోందని ఈడీ వివరించింది. వివిధ దేశాల్లో ఫండ్ రేజింగ్ పనుల కోసం 'ఆప్ ఓవర్సీస్ ఇండియా'ను ఏర్పాటు చేసినట్టు విచారణలో తెలుస్తోందని, 2016లో రూ.50 కోట్ల నిధులు రైజ్ చేయాలని వలంటీర్లకు టార్గెట్ ఇచ్చారని తెలిపింది. కెనడా మొబైల్ నెంబర్లు, ఈమెయిల్ ఐడీల ద్వారా గణనీయంగా డొనేషన్లు వచ్చాయని, తద్వారా డోన్లర్ల ఐటెంటినీని, ఏ దేశస్థులనే విషయాన్ని దాచిపెట్టారని, ఎఫ్‌సీఆర్ఏ, ఆర్‌పీఏ నిబంధలను ఉల్లంఘించారని హోం శాఖకు అందించిన నివేదికలో ఈడీ చెప్పినట్టు తెలుస్తోంది.
Read Latest National News and Telugu News
Updated Date - May 20 , 2024 | 09:31 PM