ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Supreme Court: విచారణ లేకుండా నిందితులకు నిరవధిక జైలా?... ఈడీ తీరుపై సుప్రీం అసహనం

ABN, Publish Date - Mar 20 , 2024 | 07:19 PM

మనీ లాండరింగ్ కేసుల్లో విచారాణకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తీరుపై సుప్రీంకోర్టు బుధవారంనాడు అసహనం వ్యక్తం చేసింది. విచారణ లేకుండా నిందితులను జైల్లలోనే ఉంచడం, డీపాల్డ్ బెయిల్ నిరాకరించేందుకు వరుసగా అనుబంధ ఛార్జిషీట్లు దాఖలు చేయడాన్ని నిలదీసింది.

న్యూఢిల్లీ: మనీ లాండరింగ్ (Money Laundering) కేసుల్లో విచారాణకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) తీరుపై సుప్రీంకోర్టు (Supreme Court) బుధవారంనాడు అసహనం వ్యక్తం చేసింది. విచారణ లేకుండా నిందితులను జైల్లలోనే ఉంచడం, డీపాల్డ్ బెయిల్ నిరాకరించేందుకు వరుసగా అనుబంధ ఛార్జిషీట్లు దాఖలు చేయడాన్ని నిలదీసింది.


జార్ఖాండ్‌లోని అక్రమ మైనింగ్ ఆరోపణలకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో మార్చి 1న తాజాగా దాఖలు చేసిన ఛార్జిషీటుతో పాటు మొత్తం నాలుగు అనుబంధ ఛార్జిషీట్లు దాఖలు చేయడంపై న్యాయమూర్తులు సంజీవ్ ఖన్నా, దీపంకర్ దత్తాతో కూడిన ధర్మాసనం అభ్యంతరం వ్యక్తం చేసింది. నాలుగు అనుబంధ ఛార్జిషీట్లు దాఖలు చేసినా ఇప్పటికీ ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుండటాన్ని ఈడీ తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ ఎస్పీ రాజును ధర్మాసనం ప్రశ్నించింది.


''డీఫాల్డ్ బెయిల్ ముఖ్య ఉద్దేశం విచారణ పూర్తయ్యేంత వరకూ నిందితులను అరెస్టు చేయకూడదు. దర్యాప్తు పూర్తయ్యేంత వరకూ విచారణ చేయవద్దని మీరు (ఈడీ) చెప్పలేరు. అరెస్టు చేయడానికి కూడా వీల్లేదు. ఒకదాని వెంట మరొక ఛార్జిషీటు దాఖలు చేస్తూ నిందితులను నిరవధికంగా జైళ్లలో ఉంచలేరు. నిందితుడిని అరెస్టు చేసినప్పుడే విచారణ మొదలు కావాలి. డిఫాల్డ్ బెయిల్ అనేది నిందితుడి హక్కు. అనుబంధ ఛార్జిషీట్ల ద్వారా వారి హక్కును తోసిపుచ్చలేరు. మనీష్ సిసోడియా (ఢిల్లీ ఎక్సైజ్ కేసు)లోనూ ఇదే తీరు కనిపిస్తోంది. విచారణకు జాప్యం జరుగుతుంటే కోర్టు బెయిల్ ఇవ్వొచ్చు. ఆర్టికల్ 21 నిందితుడికి లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ కల్పించిందని, నిందితుడికి బెయిల్ ఇవ్వరాదంటూ సెక్షన్ 45 కూడా దీనిని అడ్డుకోవడం లేదు'' అని స్పష్టం చేసింది. కాగా, కోర్టు అడిగిన ప్రశ్నలపై నెల రోజులు గడువు ఇవ్వాలని సొలిసిటర్ జనరల్ రాజు ధర్మాసనాన్ని కోరారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Mar 20 , 2024 | 07:20 PM

Advertising
Advertising