Delhi Excise policy: సీఎంకు మనీలాండరింగ్ కేసులో ఆరోసారి ఈడీ సమన్లు
ABN, Publish Date - Feb 14 , 2024 | 05:43 PM
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసు వ్యవహారం ముదురుతోంది. మనీలాండరింగ్ కేసు కింద విచారణకు హాజరుకావాల్సిందింగా ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు తాజాగా ఆరోసారి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) బుధవారంనాడు సమన్లు జారీ చేసింది. ఫిబ్రవరి 19వ తేదీన తమ ముందు హాజరుకావాలని ఆ సమన్లలో కోరింది.
న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ పాలసీ (Delhi Excise Policy) కేసు వ్యవహారం ముదురుతోంది. మనీలాండరింగ్ కేసు కింద విచారణకు హాజరుకావాల్సిందింగా ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal)కు తాజాగా ఆరోసారి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) బుధవారంనాడు సమన్లు జారీ చేసింది. ఫిబ్రవరి 19వ తేదీన తమ ముందు హాజరుకావాలని ఆ సమన్లలో కోరింది. ఇప్పటికే ఈడీ గత ఐదు నెలల్లో ఐదుసార్లు సమన్లు జారీ చేయగా, సమన్లు చట్టవిరుద్ధమంటూ విచారణకు కేజ్రీవాల్ గైర్హాజరయ్యారు. ఇంతకుముందు 2023 నవంబర్ 2, డిసెంబర్ 21, 2024 జనవరి 3, జనవరి 18, ఫిబ్రవరి 2 తేదీల్లో ఈడీ ఆయనకు సమన్లు పంపింది.
కాగా, ఢిల్లీ ముఖ్యమంత్రి ఉద్దేశపూర్వకంగానే తమ సమన్లు పట్టించుకోవడం లేదని, ఉన్నత స్థాయిలోని వ్యక్తి చట్టానికి కట్టుబడకపోతే సామాన్య ప్రజానీకానికి తప్పుడు సంకేతాలు అందుతాయంటూ ఈడీ ఇటీవల ఢిల్లీ కోర్టును ఆశ్రయించింది. దీనిని పరిగణనలోకి తీసుకున్న కోర్టు ఫ్రిబ్రవరి 17న తమ ముందు హాజరుకావాలని కేజ్రీవాల్‌ను ఆదేశించింది.
Updated Date - Feb 14 , 2024 | 05:43 PM