Maharashtra: షిండే వారసుడికి పట్టం..!
ABN, Publish Date - Nov 29 , 2024 | 09:30 PM
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఓటరు స్పష్టమైన తీర్పు ఇచ్చినా.. అధికార పగ్గాలు ఎవరు చేపట్టాలనే అంశంపై స్పష్టత మాత్రం రాలేదు. సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్‌కు ప్రమోషన్ వస్తుదంటూ ఊహగానాలు ఊపందుకున్నాయి. ఇక అజిత్ పవార్ డిప్యూటీ సీఎం పదవి చేపట్టనున్నారు. మరి షిండ్ మాత్రం డిప్యూటీ సీఎం పదవి చేపట్టేందుకు అయిష్టత చూపుతున్నారనే ప్రచారం సాగుతుంది.
ముంబయి, నవంబర్ 29: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఆ రాష్ట్ర ఓటరు స్పష్టమైన తీర్పు ఇచ్చారు. మహాయుతి కూటమికి వారు పట్టం కట్టారు. ఎన్నికల ఫలితాలు వెలువడి వారం దాటినా.. నేటికి ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనే విషయంలో మాత్రం ఇంకా ఆ భాగస్వామ్య పక్షాల మధ్య ఏకాభిప్రాయం మాత్రం సాధించ లేదన్నది సుస్పష్టం. మరోవైపు మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ చేపడతారనే ఓ ప్రచారం సాగుతుంది.
Also Read: జనతా గ్యారేజీగా మారిన తెలంగాణ భవన్
Also Read: విజన్ డాక్యుమెంట్‌పై సీఎం చంద్రబాబు కీలక సమీక్ష
డిప్యూటీ సీఎంగా ఎన్సీపీ (అజిత్ పవార్) అధినేత అజిత్ పవార్ చేపట్టనున్నారని తెలుస్తుంది. కానీ శివసేన (షిండే) అధినేత, ఏకనాథ్ షిండే.. డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టేందుకు సుతరాము ఇష్టపడడం లేదనే ఓ చర్చ సైతం సాగుతుంది. ఆ క్రమంలో డిప్యూటీ సీఎం పదవిని చేపట్టే వారి జాబితాలో కొత్తగా పలువురి పేర్లు వచ్చి చేరాయి.
Also Read: భారీ మోసం.. రూ. 40 కోట్లతో జంప్
Also Read: కేసీఆర్ దీక్ష ఫేక్.. విచారణ జరపాలి
డిప్యూటీ సీఎం పదవి ఎవరు చేపట్టనున్నారనేది శివసేన (షిండే) అధినేత ఏక్ నాథ్ షిండే నిర్ణయిస్తారని ఆ పార్టీ నేత సంజయ్ షిర్సత్ వెల్లడించారు. ఆ క్రమంలో ఏక్‌నాథ్ షిండే కుమారుడు శ్రీకాంత్ షిండే ఉన్నాడని తెలిపారు. అయితే అతడు ప్రస్తుతం లోక్‌సభ ఎంపీగా ఉన్నారన్నారు. మహారాష్ట్ర రాజకీయాల్లో అతడిని కీలకంగా వ్యవహరించేలా చేసేందుకు షిండే భావిస్తున్నారన్నారు.
Also Read: జనవరి నుంచీ రాజధానిలో పనులు ప్రారంభం
Also Read: మినపప్పు వల్ల ఇన్ని లాభాలున్నాయా..?
అదీకాక.. శివసేన (యూబీటీ) శాసన సభా పక్ష నేతగా ఆదిత్య ఠాక్రే ఇటీవల ఎన్నుకున్నారని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో శ్రీకాంత్ షిండేను అసెంబ్లీకి పంపి.. తన రాజకీయ వారసత్వాన్ని నిలుపుకొనే అవకాశముందని అభిప్రాయపడ్డారు. ఇక జలగావ్ గ్రామీణ ఎమ్మెల్యే గులాబ్రావ్ పాటిల్ పేరు కూడా డిప్యూటీ సీఎం జాబితాలో ఉందన్నారు. ఇప్పటికే ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో పోస్టరులు సైతం వెలిశాయని తెలిపారు.
Also Read: గత ప్రభుత్వ భూ కబ్జాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
Also Read: భారీ వర్షాలు.. ఆ నాలుగు జిల్లాలకు రెడ్ అలర్ట్
అలాగే ఉదయ్ సమంత్, దాదా భూసేతోపాటు దీపక్ కేసర్కర్‌తోపాటు భరత్ గోగ్వాలే పేర్లు సైతం వినిపిస్తున్నాయి. వీరి పేర్లే ఎందుకంటే.. శివసేనలో తిరుగుబాటు సమయంలో ఏక్‌నాథ్ షిండే తరపున వీరు కీలక పాత్ర పోషించారని సమాచారం. షిండే డిప్యూటీ సీఎం పదవి చేపట్టక పోతే.. వీరిలో ఎవరో ఒకరిని ఎంపిక చేసే అవకాశముందని చర్చ సాగుతుంది. ఇక మహారాష్ట్ర రాజకీయాల్లో అశోక్ చవాన్, దేవేంద్ర ఫడ్నవీస్.. అటు సీఎంగా, డిప్యూటీ సీఎంగా పని చేసిన విషయం విధితమే. అజిత్ పవార్ అయితే దాదాపు 8 ఏళ్లు డిప్యూటీ సీఎంగా ఉన్నారు.
For National News And Telugu News
Updated Date - Nov 29 , 2024 | 09:32 PM