Maharashtra: అమిత్‌షాను కలుసుకోనున్న షిండే.. మరి కొద్ది గంటల్లోనే ఉత్కంఠకు తెర
ABN, Publish Date - Nov 27 , 2024 | 06:01 PM
కేంద్ర హోం మంత్రి అమిత్‌షాను గురువారంనాడు కలుస్తున్నట్టు మహారాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రి షిండే తెలిపారు. రెండో సారి ముఖ్యమంత్రి పదవి దక్కకపోవడంతో అసంతృప్తితో ఉన్నానన్న వార్తలను ఆయన తోసిపుచ్చారు.
ముంబై: మహారాష్ట్ర కొత్త ముఖ్యమంత్రి విషయంలో నాలుగురోజుల ఉత్కంఠకు మరి కొద్ది గంటల్లోనే తెరపడనుంది. సీఎం ఎంపిక విషయంలో బీజేపీ అధినాయకత్వం నిర్ణయానికి పూర్తి మద్దతిస్తానని ఏక్‌నాథ్ షిండే ప్రకటించడంతో తక్కిన ప్రక్రియ సజావుగా సాగనుందనే సంకేతాలు ప్రస్ఫుటమయ్యాయి. కేంద్ర హోం మంత్రి అమిత్‌షాను గురువారంనాడు కలుస్తున్నట్టు కూడా షిండే తెలిపారు. రెండో సారి ముఖ్యమంత్రి పదవి దక్కకపోవడంతో అసంతృప్తితో ఉన్నానన్న వార్తలను ఆయన తోసిపుచ్చారు. తుదుపరి సీఎం విషయంలో బీజేపీ నిర్ణయాన్ని స్వాగతిస్తామని, తమ వైపు నుంచి ఎలాంటి స్పీడ్ బ్లేకర్లు ఉండవన్నారు.
Eknath Shinde: మనస్తాపం, కోపం లేవు... సీఎం రేసు నుంచి తప్పుకుంటున్నట్టు సంకేతాలిచ్చిన షిండే
''నేను సీఎం అయిన 6 నెలల్లోనే మూడో స్థానంలో ఉన్న మహారాష్ట్రను నెంబర్ వన్ స్థానంలోకి తెచ్చేందుకు పనిచేశాను. సొంత పేరు ప్రతిష్టతల కోసం సీఎంగా పనిచేయలేదు. మహారాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం పనిచేశాను. ప్రధాని మోదీ, అమిత్‌షాతో మంగళవారం రెండున్నర గంటలు సమావేశమయ్యాను. వారు ఏ నిర్ణయం తీసుకున్నా (సీఎం ఎంపికపై) దానికి కట్టుబడి ఉంటానని స్పష్టంగా చెప్పాను'' అని షిండే తెలిపారు. మరోసారి బుధవారంనాడు అమిత్‌షాను కలుస్తానని చెప్పారు. ఈ నేపథ్యంలో సీఎం ఎవరనేది 'మహాయుతి' కూటమి నేతలు గురువారంనాడు అధికారికంగా ప్రకటించే అవకాశాలున్నాయి.
ఇవి కూడా చదవండి
Google Maps: ఉత్తరప్రదేశ్‌లో కారు ప్రమాదం... స్పందించిన గూగుల్
Nagendra: మళ్లీ కేబినెట్‌లోకి నాగేంద్ర..
Sanatan Board: 'సనాతన్ ధర్మ రక్షా బోర్డు' ఏర్పాటు పిటిషన్‌ను తోసిపుచ్చిన ఢిల్లీ హైకోర్టు
Read More National News and Latest Telugu News
Updated Date - Nov 27 , 2024 | 06:01 PM