Election Commission: లోక్‌సభ ఎన్నికలకు ముందు ఈసీ సంచలన నిర్ణయం
ABN, Publish Date - Mar 18 , 2024 | 02:54 PM
లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission Of India) సంచలన నిర్ణయం తీసుకుంది. ఆరు రాష్ట్రాల హోం కార్యదర్శులు, బెంగాల్ పోలీసు చీఫ్‌లపై వేటు వేసింది. గుజరాత్, ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల హోంశాఖ కార్యదర్శులను తొలగిస్తూ ఈసీఐ (ECI) ఉత్తర్వులు జారీ చేసింది.
న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల (Lok Sabha eletion 2024) షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission Of India) సంచలన నిర్ణయం తీసుకుంది. ఆరు రాష్ట్రాల హోం కార్యదర్శులు, బెంగాల్ పోలీసు చీఫ్‌లపై వేటు వేసింది. గుజరాత్, ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల హోంశాఖ కార్యదర్శులను తొలగిస్తూ ఈసీఐ (ECI) ఉత్తర్వులు జారీ చేసింది. మిజోరం, హిమాచల్ ప్రదేశ్‌లోని సాధారణ పరిపాలనా విభాగం కార్యదర్శలను కూడా తొలగించింది. పశ్చిమ బెంగాల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌ని (డీజీపీ) తొలగించేందుకు ఎన్నికల సంఘం అవసరమైన చర్యలు తీసుకుందని ఈసీ వర్గాలు తెలిపాయి. లోక్‌సభ ఎన్నికలకు ముందు ఈసీ ఈ మేరకు బదిలీలు చేపట్టారు. ఎన్నికలకు ముందు ఇలాంటి బదీలీలు చేపట్టడం సాధారణ విషయమే.
మరోవైపు బృహన్ ముంబై మున్సిపల్ కమిషనర్ ఇక్బాల్ సింగ్ చాహల్‌తో పాటు అదనపు కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లను కూడా తొలగిస్తున్నట్టు ఈసీ పేర్కొంది. ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ నేతృత్వంలోని ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకుంది.
కాగా మూడేళ్లు పూర్తి చేసుకున్న, సొంత జిల్లాల్లో విధులు నిర్వహిస్తున్న అధికారులను బదిలీ చేయాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను ఎన్నికల సంఘం ఆదేశించిన విషయం తెలిసిందే. అయితే ఈ విషయంలో మహారాష్ట్ర విఫలమైందనే ఆరోపణలు వ్యక్తమైన విషయం తెలిసిందే.
ఇవి కూడా చదవండి
Shock For Congress: కాంగ్రెస్‌కు బిగ్ షాక్.. పార్టీని వీడిన పలువురు సీనియర్లు..
PM Modi: ఈ వారంలో ప్రధాని మోదీ భూటాన్ పర్యటన
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Mar 18 , 2024 | 03:42 PM